ఒద్ద నుండి యావేళ వుత్తరమిచ్చే నేను
(॥పల్లవి॥)
ఒద్ద నుండి యావేళ వుత్తరమిచ్చే నేను
పెద్దరిక మాతనిపైఁ బెనచరే యిపుడు
(॥ఒద్ద॥)
తలయెత్తి నేఁజూచితే తమకించి నవ్వినాఁడు
తలఁపెల్లా నొక్కటే తనకు నాకు
చెలులాల మీకేమైనాఁ జెప్పెనా అందలిమాట
అలిగివుందాన మీరే అడుగరే యిపుడు
(॥ఒద్ద॥)
సందడి నేఁ దగిలితే చాయలకే లోఁగినాఁడు
ముందు వెనకలు సరే మోహములోన
మందలించి మీ మనసు మఱఁగులు వాపెనా
వుందాన గుట్టునఁ బతి నొరయరే ఇపుడు
(॥ఒద్ద॥)
కాయము నే నొరసితే కాఁగిలించుకొన్నాఁడు
నాయములేల తప్పు ననుపైతేను
యీయెడ శ్రీవేంకటేశుఁ డెరిఁగెనా మీ భావము
చేయి మీఁదై వున్నదాన చెలఁగరే ఇపుడు
(||pallavi||)
ŏdda nuṁḍi yāveḽa vuttaramichche nenu
pĕddariga mādanibaim̐ bĕnasare yibuḍu
(||ŏdda||)
talayĕtti nem̐jūside tamagiṁchi navvinām̐ḍu
talam̐pĕllā nŏkkaḍe tanagu nāgu
sĕlulāla mīgemainām̐ jĕppĕnā aṁdalimāḍa
aligivuṁdāna mīre aḍugare yibuḍu
(||ŏdda||)
saṁdaḍi nem̐ dagilide sāyalage lom̐ginām̐ḍu
muṁdu vĕnagalu sare mohamulona
maṁdaliṁchi mī manasu maṟam̐gulu vābĕnā
vuṁdāna guṭṭunam̐ badi nŏrayare ibuḍu
(||ŏdda||)
kāyamu ne nŏraside kām̐giliṁchugŏnnām̐ḍu
nāyamulela tappu nanubaidenu
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍĕrim̐gĕnā mī bhāvamu
seyi mīm̐dai vunnadāna sĕlam̐gare ibuḍu