ఒద్ద నిద్దరున్నారు వొడ్డోలగమై వున్నాఁడు
(॥పల్లవి॥)
ఒద్ద నిద్దరున్నారు వొడ్డోలగమై వున్నాఁడు
కొద్దిమీరి లోకమేలే గుణవంతుఁ డతఁడు
(॥ఒద్ద॥)
తమకమే కలిగితే తానే నాయింటికి వచ్చీ
రమణుని దూరకురే రామలాల
సముకమున నే నుంటే చనవు తానే యిచ్చీ
తిమురుచు నీతనితో దీకొనఁగ వచ్చునా
(॥ఒద్ద॥)
మన్నించవలసితే మాటలు తానే యాడీ
సన్నల నాడించకురే సతులాల
పన్ని నే సేవసేయఁగా భావము దానే కరఁగీ
విన్నపము లిట్టె చేసి వేఁగిరించవచ్చునా
(॥ఒద్ద॥)
కరుణ గలిగితేను కాఁగిటఁ దానే కూడీ
పరుసా లాడకురే పడఁతులాల
ఇరవై శ్రీ వేంకటేశుఁ డీతఁడిదె నన్ను నేఁడె
అరుదై పెనఁగఁగాను అవుఁగాదనవచ్చునా
(||pallavi||)
ŏdda niddarunnāru vŏḍḍolagamai vunnām̐ḍu
kŏddimīri logamele guṇavaṁtum̐ ḍadam̐ḍu
(||ŏdda||)
tamagame kaligide tāne nāyiṁṭigi vachchī
ramaṇuni dūragure rāmalāla
samugamuna ne nuṁṭe sanavu tāne yichchī
timurusu nīdanido dīgŏnam̐ga vachchunā
(||ŏdda||)
manniṁchavalaside māḍalu tāne yāḍī
sannala nāḍiṁchagure sadulāla
panni ne sevaseyam̐gā bhāvamu dāne karam̐gī
vinnabamu liṭṭĕ sesi vem̐giriṁchavachchunā
(||ŏdda||)
karuṇa galigidenu kām̐giḍam̐ dāne kūḍī
parusā lāḍagure paḍam̐tulāla
iravai śhrī veṁkaḍeśhum̐ ḍīdam̐ḍidĕ nannu nem̐ḍĕ
arudai pĕnam̐gam̐gānu avum̐gādanavachchunā