Odambaradurugaaga voppugaa nadasenani

ఒడఁబరతురుగాక వొప్పుగా నడచేనని
Language

(॥పల్లవి॥)
ఒడఁబరతురుగాక వొప్పుగా నడచేనని
నడుమఁ గొసరితేను నమ్మునా చెలియా

(॥ఒడఁ॥)
మనసున నొకటి మాఁటల నొకటీఁ
బెనచి దూరుదురు ప్రియురాండ్లు
ఘనుఁడవు నీవైతేకలవెల్లాఁ జేసివచ్చి
ననువులు నటించితే నమ్మునా చెలియా

(॥ఒడఁ॥)
నగవులో నొకటి నటనల నొకటీ
యెగసక్కే లాడుదురు యింతులెల్లా
మగఁడవు నీవైతే మతకానఁదిరిగాడి
నగరిలో నుంటేను నమ్మునా చెలియా

(॥ఒడఁ॥)
సన్నల నొకటి జంకెనల నొకటీఁ
బన్ని చెనకుదురుపడఁతులెల్లా
వున్నతి శ్రీవేంకటేశ వొనగూడితి వీపెను
నన్ను నమ్మించితే నమ్మునా చెలియా

(||pallavi||)
ŏḍam̐baradurugāga vŏppugā naḍasenani
naḍumam̐ gŏsaridenu nammunā sĕliyā

(||ŏḍam̐||)
manasuna nŏgaḍi mām̐ṭala nŏgaḍīm̐
bĕnasi dūruduru priyurāṁḍlu
ghanum̐ḍavu nīvaidegalavĕllām̐ jesivachchi
nanuvulu naḍiṁchide nammunā sĕliyā

(||ŏḍam̐||)
nagavulo nŏgaḍi naḍanala nŏgaḍī
yĕgasakke lāḍuduru yiṁtulĕllā
magam̐ḍavu nīvaide madagānam̐dirigāḍi
nagarilo nuṁṭenu nammunā sĕliyā

(||ŏḍam̐||)
sannala nŏgaḍi jaṁkĕnala nŏgaḍīm̐
banni sĕnagudurubaḍam̐tulĕllā
vunnadi śhrīveṁkaḍeśha vŏnagūḍidi vībĕnu
nannu nammiṁchide nammunā sĕliyā