(॥పల్లవి॥)
ఓపో అదేడ సుద్ది వోశక్క
కోపగించుకొందురటె గొబ్బున నోశక్క
(॥ఓపో॥)
చెల్లుబడిగలవాఁడు చేతికి విడెమియ్యఁగ
వొల్లనందురటవె వోశక్క
గొల్లదానవంటా నీకొంగువట్టి తియ్యఁగాను
మల్లాడుదురటవే మరియు నోశక్క
(॥ఓపో॥)
వుద్దండాన నాతఁడు వుబ్బుబ్బి పిలువఁగాను
వొద్దికి రాకుండుదుర టె వొశక్క
ముద్దుముద్దువలె నీపై మోహమోల్లాఁ జల్లఁగాను
గద్దించి తిటుదురటె కమ్మటి వోశక్క
(॥ఓపో॥)
ఆరీతి చుట్టరికాలు అట్టె నీతోఁ జెప్పఁగాను
వూరకుండుదురటవె వోశక్క
ఆరయ శ్రీవేంకటేశుఁ డట్టె నిన్నుఁ గూడెను
గోర గీరుదురటవె కొసరి వోశక్క
(||pallavi||)
obo adeḍa suddi vośhakka
kobagiṁchugŏṁduraḍĕ gŏbbuna nośhakka
(||obo||)
sĕllubaḍigalavām̐ḍu sedigi viḍĕmiyyam̐ga
vŏllanaṁduraḍavĕ vośhakka
gŏlladānavaṁṭā nīgŏṁguvaṭṭi tiyyam̐gānu
mallāḍuduraḍave mariyu nośhakka
(||obo||)
vuddaṁḍāna nādam̐ḍu vubbubbi piluvam̐gānu
vŏddigi rāguṁḍudura ṭĕ vŏśhakka
muddumudduvalĕ nībai mohamollām̐ jallam̐gānu
gaddiṁchi tiḍuduraḍĕ kammaḍi vośhakka
(||obo||)
ārīdi suṭṭarigālu aṭṭĕ nīdom̐ jĕppam̐gānu
vūraguṁḍuduraḍavĕ vośhakka
āraya śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ ninnum̐ gūḍĕnu
gora gīruduraḍavĕ kŏsari vośhakka