Obamayyaa needo navva noorage vumdemugaani

ఓపమయ్యా నీతో నవ్వ నూరకే వుండేముగాని
Language

(॥పల్లవి॥)
ఓపమయ్యా నీతో నవ్వ నూరకే వుండేముగాని
చేపట్టి నీవే యేలితే సేవ సేసేఁగాని

(॥ఓప॥)
కూరిమిలేనిచోట కుమ్మరించి కుమ్మరించి
సారెసారె నవ్వినాను చౌకలౌను
మేరలు మీరేయప్పుడు మేనవారికైనాను
గోర గీరితీఁజాలు గొప్పయేరై వుండును

(॥ఓప॥)
యెగ్గులువట్టేవారు యెచ్చరించి యెచ్చరించి
వొగ్గి సరసమాడినా నొల్లఁబట్టౌను
వెగ్గళించవలసితే వింతలేని వారికైనా
దిగ్గనఁ గొసరితేను తీగెసాడు మాటలు

(॥ఓప॥)
ఆయమెఱిఁగినవారు ఆదరించి యాదరించి
చేయివట్టి తీసినాను చెమట లూరు
యీయెడ శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
పాయక నన్నేలితివి పంతమాడేవారమా

(||pallavi||)
obamayyā nīdo navva nūrage vuṁḍemugāni
sebaṭṭi nīve yelide seva sesem̐gāni

(||oba||)
kūrimilenisoḍa kummariṁchi kummariṁchi
sārĕsārĕ navvinānu saugalaunu
meralu mīreyappuḍu menavārigainānu
gora gīridīm̐jālu gŏppayerai vuṁḍunu

(||oba||)
yĕgguluvaṭṭevāru yĕchchariṁchi yĕchchariṁchi
vŏggi sarasamāḍinā nŏllam̐baṭṭaunu
vĕggaḽiṁchavalaside viṁtaleni vārigainā
digganam̐ gŏsaridenu tīgĕsāḍu māḍalu

(||oba||)
āyamĕṟim̐ginavāru ādariṁchi yādariṁchi
seyivaṭṭi tīsinānu sĕmaḍa lūru
yīyĕḍa śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
pāyaga nannelidivi paṁtamāḍevāramā