O premaa... naalo nuvve prema navve pra

ఓ ప్రేమా... నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్ర
Year
Language

పల్లవి:

ఓ ప్రేమా... నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా... ఇంక ఏదేమైనా రావే మైనా రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా
అదరాలి నాలో అందం అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంబం మురిపాలు పిండేస్తే
ఒక మాటో... అర మాటో... అలవాటుగా మారే వేళ

ఓ ప్రేమా... నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా...

చరణం 1:

చలువరాతి హంస మేడలో ఎండే చల్లనా
వలువ చాటు అందగత్తెలో వయసే వెచ్చనా
వసంతపు తేనెతోనే తలంటులే పోయనా
వరూధిని సోయగాల స్వరాలు నే మీటనా
నువ్వు కల్లోకొస్తే తెల్లారే కాలం
నిన్ను చూడాలంటే కొండెక్కే దీపం
నువ్వు కవ్విస్తుంటే నవ్వింది రాగం
రెండు గుండెల్లోన తప్పింది తాళం
మురిసింది తార మూగాకాశంలో...
ఓ ప్రేమా... నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా... ఇంకా నేనేమైనా నీకేమైనా గలై వీచి కూలే ప్రేమ తెలుసా
విధి నిన్ను ఓడిస్తుంటే
వ్యధలాగ నే ఉన్నా
కథ మారి కాటేస్తుంటే ఓడిగట్టిపోతున్నా
ఎడబాటే ఎదపాటై చలి నీరుగా సాగే వేళ
ఓ ప్రేమా... నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా...

చరణం 2:

మనసులోన తీపి మమతలు ఎన్నో ఉంటవీ
ఇసుక మీద కాలి గురుతులై నిలిచేనా అవీ
ఎడారిలో కోయిలమ్మ కచేరి నా ప్రేమగా
ఎదారినా దారిలోనే షికారులే నావిగా
కన్నె అందాలన్ని పంపే ఆహ్వానం
కౌగిలింతల్లోనే కానీ కళ్యాణం
స్వర్గలోకంలోనే పెళ్ళీ పేరంటం
సందె మైకంలోనే పండే తాంబూలం
మెరిసింది తార ప్రేమాకాశంలో...

ఓ ప్రేమా... నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా... ఇంక ఏదేమైనా రావే మైనా రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా
అదరాలి నాలో అందం అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంబం మురిపాలు పిండేస్తే
ఒక మాటో... అర మాటో... అలవాటుగా మారే వేళ

ఓ ప్రేమా... నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా...

pallavi:

o premā... nālo nuvve prema navve prema puvvai tenĕ pŏṁge prema tĕlusā
o mainā... iṁka edemainā rāve mainā rāgālĕnno tīse prema tĕlusā
adarāli nālo aṁdaṁ adharālu aṁdiste
mudarāli summā suṁbaṁ muribālu piṁḍeste
ŏga māḍo... ara māḍo... alavāḍugā māre veḽa

o premā... nālo nuvve prema navve prema puvvai pūse rāle prema tĕlusā
o mainā...

saraṇaṁ 1:

saluvarādi haṁsa meḍalo ĕṁḍe sallanā
valuva sāḍu aṁdagattĕlo vayase vĕchchanā
vasaṁtabu tenĕdone talaṁṭule poyanā
varūdhini soyagāla svarālu ne mīḍanā
nuvvu kallogŏste tĕllāre kālaṁ
ninnu sūḍālaṁṭe kŏṁḍĕkke dībaṁ
nuvvu kavvistuṁṭe navviṁdi rāgaṁ
rĕṁḍu guṁḍĕllona tappiṁdi tāḽaṁ
murisiṁdi tāra mūgāgāśhaṁlo...
o premā... nālo nuvve prema navve prema puvvai pūse rāle prema tĕlusā
o mainā... iṁkā nenemainā nīgemainā galai vīsi kūle prema tĕlusā
vidhi ninnu oḍistuṁṭe
vyadhalāga ne unnā
katha māri kāḍestuṁṭe oḍigaṭṭibodunnā
ĕḍabāḍe ĕdabāḍai sali nīrugā sāge veḽa
o premā... nālo nuvve prema navve prema puvvai tenĕ pŏṁge prema tĕlusā
o mainā...

saraṇaṁ 2:

manasulona tībi mamadalu ĕnno uṁṭavī
isuga mīda kāli gurudulai nilisenā avī
ĕḍārilo koyilamma kaseri nā premagā
ĕdārinā dārilone ṣhigārule nāvigā
kannĕ aṁdālanni paṁpe āhvānaṁ
kaugiliṁtallone kānī kaḽyāṇaṁ
svargalogaṁlone pĕḽḽī peraṁṭaṁ
saṁdĕ maigaṁlone paṁḍe tāṁbūlaṁ
mĕrisiṁdi tāra premāgāśhaṁlo...