ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా
పల్లవి:
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా...
ఓ ప్రేమా నుదిటి మీద కావమ్మా కుంకుమా...
పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా...
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా...
చరణం 1:
అసలెందుకే ఆ అమృతమే అనురాగముతో నువ్వు నవ్వితే
రతి సుందరిలా దరి చేరితే
చెలరేగిపోయే యవ్వనమే మగ కోరికతో మాటాడితే
కొస చూపులతో తాకితే
మేను మేను ఆనీ తేలి సోలిపోనీ
ఏది ఏమి కానీ ఏకమవ్వనీ
రా మరీ...నా చెలీ...
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా...
చరణం 2:
షెహనాయి మోగే కోవెలలో శశి కాంతులతో నను చేరుకో
గృహ దేవతలా ఒడి చేర్చుకో
రతనాలు పండే నీ జతలో సుఖ శాంతులతో శ్రుతి చేసుకో
ప్రియ లాహిరిలో ఏలుకో
లోకమందు లేని హాయి అందుకోనీ
కోటి జన్మలన్నీ తోడు ఉండనీ
రా మరీ...నా చెలీ..
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా...
ఓ ప్రేమా నుదిటి మీద కావమ్మా కుంకుమా...
పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా...
pallavi:
o premā hṛdaya vīṇa nīvammā prāṇamā...
o premā nudiḍi mīda kāvammā kuṁkumā...
pasubu pūla vĕnnĕla pasiḍi haṁsa kannĕlā
serumā saitramā snehamā...
o premā hṛdaya vīṇa nīvammā prāṇamā...
saraṇaṁ 1:
asalĕṁduge ā amṛtame anurāgamudo nuvvu navvide
radi suṁdarilā dari seride
sĕlaregiboye yavvaname maga korigado māḍāḍide
kŏsa sūbulado tāgide
menu menu ānī teli solibonī
edi emi kānī egamavvanī
rā marī...nā sĕlī...
o premā hṛdaya vīṇa nīvammā prāṇamā...
saraṇaṁ 2:
ṣhĕhanāyi moge kovĕlalo śhaśhi kāṁtulado nanu serugo
gṛha devadalā ŏḍi sersugo
radanālu paṁḍe nī jadalo sukha śhāṁtulado śhrudi sesugo
priya lāhirilo elugo
logamaṁdu leni hāyi aṁdugonī
koḍi janmalannī toḍu uṁḍanī
rā marī...nā sĕlī..
o premā hṛdaya vīṇa nīvammā prāṇamā...
o premā nudiḍi mīda kāvammā kuṁkumā...
pasubu pūla vĕnnĕla pasiḍi haṁsa kannĕlā
serumā saitramā snehamā...