O mai phremd

ఓ మై ఫ్రెండ్
Work
Year
Language

పల్లవి:

పాదమెటుపోతున్నా పయనమెందాకైనా
అడుగు తడబడుతున్నా తోడు రానా
చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా
గుండె ప్రతి లయలోనా నేను లేనా
ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా
ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

చరణం 1:

అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుందీ
జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో పంచుతోందీ
మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే
మోమాటాలే లేని కళే జాలువారే
ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడనీవే
ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

చరణం 2:

వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే
నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంత వాలే
గిల్లి కజ్జా లెన్నో ఇలా పెంచుకుంటూ
తుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే
ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడనీదే
ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

pallavi:

pādamĕḍubodunnā payanamĕṁdāgainā
aḍugu taḍabaḍudunnā toḍu rānā
sinni ĕḍabāḍainā kaṁṭa taḍi pĕḍudunnā
guṁḍĕ pradi layalonā nenu lenā
ŏṁṭarainā oḍamainā vĕṁṭa naḍise nīḍavenā
o mai phrĕṁḍ taḍi kannulane tuḍisina nestamā
o mai phrĕṁḍ ŏḍiduḍugulalo nilisina snehamā

saraṇaṁ 1:

amma ŏḍilo leni pāśhaṁ nestamalle alluguṁdī
janmagaṁtā tīribonī mamadalĕnno paṁchudoṁdī
mīru mīru nuṁchi mana sneha gīdaṁ erā erāllogi māre
momāḍāle leni kaḽe jāluvāre
ŏṁṭarainā oḍamainā vĕṁṭa naḍise nīḍanīve
o mai phrĕṁḍ taḍi kannulane tuḍisina nestamā
o mai phrĕṁḍ ŏḍiduḍugulalo nilisina snehamā

saraṇaṁ 2:

vāna vaste kāgidāle paḍavalayye jñābagāle
ninnu sūste sinnanāḍi sedalannī sĕṁta vāle
gilli kajjā lĕnno ilā pĕṁchuguṁṭū
tuḽḽiṁtallo tele snehaṁ
mŏdalo tudalo tĕlibe muḍi vīḍaguṁde
ŏṁṭarainā oḍamainā vĕṁṭa naḍise nīḍanīde
o mai phrĕṁḍ taḍi kannulane tuḍisina nestamā
o mai phrĕṁḍ ŏḍiduḍugulalo nilisina snehamā