పల్లవి:
ష్ గప్ చుప్ ష్ గప్ చుప్
ష్ గప్ చుప్ ష్ గప్ చుప్ ష్ గప్ చుప్ ష్ గప్ చుప్
ష్ గప్ చుప్ ష్ గప్ చుప్
చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు
చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు...
కళ్ళు లేని కబోది బాబూ
దయచేసి దానం చెయ్యండి బాబూ
దేవుడు చల్లగా చూస్తాడు బాబూ
చిల్లర లేదని ఖంగారు పడద్దు బాబూ
వంద రూపాయలదాకా నేనడ్జస్ట్ చేస్తాను బాబూ
చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు
చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు...
ఓ బాబయ్యో..ఓ..ఓ.....
ఓ బాబయ్యో..ఓ..ఓ.....
లోకాన రైలు బండి చికుచికు అంటుంది కు కు క్కూ అంటుంది
లౌక్యంగా బ్రతుకు బండి గప్ చుప్ అంటుంది ష్ గప్ చుప్ అంటుంది
కళ్ళెదుటే కల్లోలాలూ ఘోరాలెన్నో అవుతున్నా
ఏమంటే ఏమౌనో అని ఎవరికి వారే గప్ చుపులూ
ఓ బాబయ్యో..ఓ..ఓ.....
చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు
చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు...
చరణం 1:
లక్షమందిలో హత్య చేసినా లంచం ఇస్తే గప్ చుప్
లాకప్ గదిలో రేపు జరిపినా లా అండ్ ఆర్డర్ గప్ చుప్
కొనే సరుకులో కల్తీ అది తెలిసీ పబ్లిక్ గప్ చుప్
సీటు లేదనే టీ.సీ ఓ నోటు విసిరితే గప్ చుప్
సారా కీ ఆమ్యామ్యాకీ ఓటరు గప్ చుపులూ
ఆ వోటరు వెన్నులు విరిగే పన్నులు వేసీ దిగమింగేసి నాయకులంతా గప్ చుప్ గప్ చుపులూ
చరణం 2:
బాబూ ధర్మం చెయ్యండి బాబూ కళ్ళులేని కబోది బాబూ
దానం చెయ్యండి బాబూ పుణ్యం వస్తది బాబూ పుణ్యం బాబూ..
చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు
చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు
ఓ బాబయ్యో..ఓ..ఓ.....
చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు
చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు
అరెరరె.. ఖజానాలో జనాల సొమ్ము ప్రజా నాయకులు గప్ చుప్
ప్రభుత్వమిచ్చే అప్పు తీసుకుని ప్రజలూ ఆపై గప్ చుప్
పిల్లకి నెలతప్పించి పిల్లడు పెళ్ళికి గప్ చుప్
శిష్యుడు కాపీ కొడితే బెదిరిన గురువూ గప్ చుప్
గుళ్ళోన దొంగలు పడితే భక్తులు గప్ చుపులూ
ఆ భక్తుల నగలేపోయి బావురుమంటే దేవుడు కూడా మనకెందుకనీ గప్ చుప్ గప్ చుపులూ
చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు
చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు
నో ఫైవ్ పైసే టెన్ పైసే బాబూ ఓన్లీ ఫిఫ్టీ పైసే అండ్ వన్ రూపీ బాబూ
కళ్ళులేని కబోది బాబూ
దానం చెయ్యండి బాబూ
ఓ బాబయ్యో..ఓ..ఓ.....
ఓ బాబయ్యో..ఓ..ఓ.....
లోకాన రైలు బండి చికుచికు అంటుంది కు కు క్కూ అంటుంది
లౌక్యంగా బ్రతుకు బండి గప్ చుపు అంటుంది ష్ గప్ చుప్ అంటుంది
కళ్ళెదుటే కల్లోలాలూ ఘోరాలెన్నో అవుతున్నా
ఏమంటే ఏమౌనో అని ఎవరికి వారే గప్ చుపులూ
ఓ బాబయ్యో..ఓ..ఓ.....