O aagaasham ammaayaide

ఓ ఆకాశం అమ్మాయైతే
Year
Language

పల్లవి:

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం

ఓ ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే.. నీలా ఉంటుందే..
ఓ ఓ ఓ.. ఆనందం అల్లరి చేస్తే.. నాలా ఉంటుందే..
నాలా ఉంటుందే.. నాలా ఉంటుందే
వానల్లే నువ్వు జారగా నేలల్లె నేను మారగా
వాగల్లె నువ్వు నేను చేరగా
మది వరదై పొంగి సాగరమవుతుందే
హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం

చరణం 1:

అల్లేసి.. నను గిల్లేసి.. తెగ నవ్వినావే సుగుణాల రాక్షసీ.. శత్రువంటి ప్రేయసి
పట్టేసి.. కనిపెట్టేసి.. దడ పెంచినావే దయలేని ఊర్వశి.. దేవతంటి రూపసి

గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే.. నిద్దుర పుచ్చేనే..
ఓ ఓ ఓ.. లోకంలో అందాలన్నీ నీలో చేరెనే.. నిద్దుర లేపెనే..
హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల

ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం
ఈనాడే తెలిసింది కొత్త పదం
ఆనందం ఆనందం నీవల్లే ఇంతానందం
గుండెల్లో కదిలింది పూల రథం

చరణం 2:

వచ్చేసి.. బతికిచ్చేసి.. మసి చేసినావే రుషి లాంటి నా రుచి.. మార్చినావే అభిరుచి
సిగ్గేసి.. చలిమొగ్గేసి.. ఉసి గొలిపినావె సరిగమగా పదనిసి చేర్చినావే రోదసి
స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే.. ప్రాణం పోసేనే
ఓ ఓ ఓ.. నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసెనే

హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం

pallavi:

eṁ sakkani maṁdāraṁ idi ĕnimidi dikkula siṁdhūraṁ
eṁ mĕttani baṁgāraṁ idi manasuna rebĕnu kaṁgāraṁ
eṁ kammani karbūraṁ idi kannĕga mārina kāśhmīraṁ
eṁ vannĕla vayyāraṁ iga tiyyani premagi tayyāraṁ

o āgāśhaṁ ammāyaide nīlā uṁṭuṁde.. nīlā uṁṭuṁde..
o o o.. ānaṁdaṁ allari seste.. nālā uṁṭuṁde..
nālā uṁṭuṁde.. nālā uṁṭuṁde
vānalle nuvvu jāragā nelallĕ nenu māragā
vāgallĕ nuvvu nenu seragā
madi varadai pŏṁgi sāgaramavuduṁde
holā holāha holā holāha nī kaḽḽallone sikkāne pilla
holā holāha holā holāha iga sālā sālā jarige nī valla

eṁ sakkani maṁdāraṁ idi ĕnimidi dikkula siṁdhūraṁ
eṁ mĕttani baṁgāraṁ idi manasuna rebĕnu kaṁgāraṁ
eṁ kammani karbūraṁ idi kannĕga mārina kāśhmīraṁ
eṁ vannĕla vayyāraṁ iga tiyyani premagi tayyāraṁ

saraṇaṁ 1:

allesi.. nanu gillesi.. tĕga navvināve suguṇāla rākṣhasī.. śhatruvaṁṭi preyasi
paṭṭesi.. kanibĕṭṭesi.. daḍa pĕṁchināve dayaleni ūrvaśhi.. devadaṁṭi rūbasi

gālullo rāgālannī nīlo paligene.. niddura puchchene..
o o o.. logaṁlo aṁdālannī nīlo serĕne.. niddura lebĕne..
holā holāha holā holāha nī kaḽḽallone sikkāne pilla
holā holāha holā holāha iga sālā sālā jarige nī valla

ānaṁdaṁ ānaṁdaṁ ānaṁdaṁ aṁṭe ardhaṁ
īnāḍe tĕlisiṁdi kŏtta padaṁ
ānaṁdaṁ ānaṁdaṁ nīvalle iṁtānaṁdaṁ
guṁḍĕllo kadiliṁdi pūla rathaṁ

saraṇaṁ 2:

vachchesi.. badigichchesi.. masi sesināve ruṣhi lāṁṭi nā rusi.. mārsināve abhirusi
siggesi.. salimŏggesi.. usi gŏlibināvĕ sarigamagā padanisi sersināve rodasi
svargaṁlo saukhyālannī nīlo pŏṁgene.. prāṇaṁ posene
o o o.. naragaṁlo nānā hiṁsalu nīlo sŏgasene prāṇaṁ posĕne