Nivveragudoda nemu nilusunnaara midivo

నివ్వెరగుతోడ నేము నిలుచున్నార మిదివో
Language

(॥పల్లవి॥)
నివ్వెరగుతోడ నేము నిలుచున్నార మిదివో
దవ్వులనుండి నీకెట్టు తమి రేఁచేమయ్యా

(॥॥)
మనసులోపలిమాట మగువ కాడఁగరాదు
తనువుమీఁదటికాఁక ధరించరాదు
వనితఁ బాసివాడలవారితో జూజమాడేవు
వినయాన నీకేమని విన్న వించేమయ్యా

(॥॥)
కన్నులఁజూచేయాసలు గక్కన నాపఁగరావు
పన్ని పాయపుసిగ్గులు పట్టఁగరావు
సన్నల నింతులతోడ సాము సేసే విందు
అన్నిటా నిన్నెట్లాఁ జాయకుఁ దెచ్చేమయ్యా

(॥॥)
కూడినట్టి నీరతులు కొలఁదివెట్టఁగరావు
వాడుమోవిగుఱుతులు వంచించరావు
యీడనే శ్రీ వేంకటేశ యేలితి వింతలో వచ్చి
తోడనే నీకిరితిఁ బోదులు సేసేమయ్యా

(||pallavi||)
nivvĕragudoḍa nemu nilusunnāra midivo
davvulanuṁḍi nīgĕṭṭu tami rem̐semayyā

(||||)
manasulobalimāḍa maguva kāḍam̐garādu
tanuvumīm̐daḍigām̐ka dhariṁcharādu
vanidam̐ bāsivāḍalavārido jūjamāḍevu
vinayāna nīgemani vinna viṁchemayyā

(||||)
kannulam̐jūseyāsalu gakkana nābam̐garāvu
panni pāyabusiggulu paṭṭam̐garāvu
sannala niṁtuladoḍa sāmu sese viṁdu
anniḍā ninnĕṭlām̐ jāyagum̐ dĕchchemayyā

(||||)
kūḍinaṭṭi nīradulu kŏlam̐divĕṭṭam̐garāvu
vāḍumoviguṟudulu vaṁchiṁcharāvu
yīḍane śhrī veṁkaḍeśha yelidi viṁtalo vachchi
toḍane nīgiridim̐ bodulu sesemayyā