నిరతి వెరగయ్యీని నీవిధము చూచి నాకు
(॥పల్లవి॥)
నిరతి వెరగయ్యీని నీవిధము చూచి నాకు
తెరమఱఁగున సాదించితివో పనులు
(॥నిర॥)
సతి నిన్నిట్టె తలఁచఁగానే విచ్చేసితివి
తతి వేగువెట్టుక ఇందాఁకా నుంటివో
అతివల మనసుల అదనెల్లఁ దెలుసునో
అతనుఁడు నీ కేపొద్దు నన్నియునుఁ జెప్పునో
(॥నిర॥)
మాట నోర నుండఁగానో మారుమాట లాడితివి
యీటున నేమైనా మంత్ర మెఱుఁగుదువో
మూటగా నిట్టెపుస్తకమున వ్రాసుకుండితివో
నాఁటనుడియు నవధానములు నేరుతవో
(॥నిర॥)
కలగనినట్లనే కాఁగిలిం కూడితివి
యెలమి నిద్దరిదేహా లేకములో
వెలయ శ్రీవేంకటేశ విద్యలు సాదించితివో
బలిమి నీ విందిరిపాలిటిదేవరవో
(||pallavi||)
niradi vĕragayyīni nīvidhamu sūsi nāgu
tĕramaṟam̐guna sādiṁchidivo panulu
(||nira||)
sadi ninniṭṭĕ talam̐sam̐gāne vichchesidivi
tadi veguvĕṭṭuga iṁdām̐kā nuṁṭivo
adivala manasula adanĕllam̐ dĕlusuno
adanum̐ḍu nī kebŏddu nanniyunum̐ jĕppuno
(||nira||)
māḍa nora nuṁḍam̐gāno mārumāḍa lāḍidivi
yīḍuna nemainā maṁtra mĕṟum̐guduvo
mūḍagā niṭṭĕbustagamuna vrāsuguṁḍidivo
nām̐ṭanuḍiyu navadhānamulu nerudavo
(||nira||)
kalaganinaṭlane kām̐giliṁ kūḍidivi
yĕlami niddaridehā legamulo
vĕlaya śhrīveṁkaḍeśha vidyalu sādiṁchidivo
balimi nī viṁdiribāliḍidevaravo