Ninnum joosi veragayyee nemdu maagimdarigini

నిన్నుఁ జూచి వెరగయ్యీ నేఁడు మాకిందరికిని
Language

(॥పల్లవి॥)
నిన్నుఁ జూచి వెరగయ్యీ నేఁడు మాకిందరికిని
యెన్నికె కెక్కినవాఁడ వింత సేయఁదగునా

(॥నిన్నుఁ॥)
సిగ్గువడఁగానే చెలిఁ జేయివట్టి తీసేవు
యెగ్గనౌ యెవ్వరుంటా నెఱఁగవు
అగ్గలము మోహమైతే నాడేవారిఁ జూడవద్దా
వొగ్గి మగవాఁడ వింత కొడిగట్టఁదగునా

(॥నిన్నుఁ॥)
తప్పించుకొనఁగానే తరుణి చన్ను లంటేవు
ఇప్పుడేఁటి కనవు నీ యెమ్మె మానవు
ముప్పిరిఁ జుట్టమవైతే ముందువెన కెంచవద్దా
చెప్పరాని దొరవైతే చేఁత సేయఁదగునా

(॥నిన్నుఁ॥)
తెరవేసుకొనఁగానే దీకొని ఇంతిఁ గూడేవు
అరిదిపడవు సారె నంటువాయవు
ఇరవై శ్రీ వేంకటేశ యేలితివి మమ్మునెల్లా
సరసుఁడ వింతేసి వేసాలు సేయఁదగునా

(||pallavi||)
ninnum̐ jūsi vĕragayyī nem̐ḍu māgiṁdarigini
yĕnnigĕ kĕkkinavām̐ḍa viṁta seyam̐dagunā

(||ninnum̐||)
sigguvaḍam̐gāne sĕlim̐ jeyivaṭṭi tīsevu
yĕgganau yĕvvaruṁṭā nĕṟam̐gavu
aggalamu mohamaide nāḍevārim̐ jūḍavaddā
vŏggi magavām̐ḍa viṁta kŏḍigaṭṭam̐dagunā

(||ninnum̐||)
tappiṁchugŏnam̐gāne taruṇi sannu laṁṭevu
ippuḍem̐ṭi kanavu nī yĕmmĕ mānavu
muppirim̐ juṭṭamavaide muṁduvĕna kĕṁchavaddā
sĕpparāni dŏravaide sem̐ta seyam̐dagunā

(||ninnum̐||)
tĕravesugŏnam̐gāne dīgŏni iṁtim̐ gūḍevu
aridibaḍavu sārĕ naṁṭuvāyavu
iravai śhrī veṁkaḍeśha yelidivi mammunĕllā
sarasum̐ḍa viṁtesi vesālu seyam̐dagunā