Ninnu nannu nemchugomte neeve nenu | neevu

నిన్ను నన్ను నెంచుకొంటే నీవే నేను । నీవు
Language

(॥పల్లవి॥)
నిన్ను నన్ను నెంచుకొంటే నీవే నేను । నీవు
మన్నించినదే గురుతు మరి యాడ సుద్దులు

(॥నిన్ను॥)
నీ తలనే వేగేనా నెలఁతలఁ బెండ్లాడేది
కాతరించేవారికెల్లాఁ గలదే ఇది
నాతో నేమి చేప్పేవు నన్నొడఁబరచనేల
యీతల నీ చేఁతలెల్లా నియ్యకొంటి నేను

(॥నిన్ను॥)
యెవ్వరు నెఱఁగనివా యిలలో నీ వలపులు
జవ్వనపువా రుండేటి జాడలే ఇవి
తవ్వనేల యిసుకపాఁతరలు సారె సారెకు
పువ్వులవంటి గుణాలు పొగడే నిపుడు

(॥నిన్ను॥)
మఱవఁగ వచ్చునా మనసులో తలపోఁత
పెఱరేఁచి నిన్ను రట్టుపెట్టకుండునా
యెఱుఁగుదు శ్రీవేంకటేశ నన్ను నేలితివి
మెఱసి నీ పొందులకు మెచ్చితి నన్నిటాను

(||pallavi||)
ninnu nannu nĕṁchugŏṁṭe nīve nenu | nīvu
manniṁchinade gurudu mari yāḍa suddulu

(||ninnu||)
nī talane vegenā nĕlam̐talam̐ bĕṁḍlāḍedi
kādariṁchevārigĕllām̐ galade idi
nādo nemi seppevu nannŏḍam̐barasanela
yīdala nī sem̐talĕllā niyyagŏṁṭi nenu

(||ninnu||)
yĕvvaru nĕṟam̐ganivā yilalo nī valabulu
javvanabuvā ruṁḍeḍi jāḍale ivi
tavvanela yisugabām̐taralu sārĕ sārĕgu
puvvulavaṁṭi guṇālu pŏgaḍe nibuḍu

(||ninnu||)
maṟavam̐ga vachchunā manasulo talabom̐ta
pĕṟarem̐si ninnu raṭṭubĕṭṭaguṁḍunā
yĕṟum̐gudu śhrīveṁkaḍeśha nannu nelidivi
mĕṟasi nī pŏṁdulagu mĕchchidi nanniḍānu