నిన్ను మోఁచి వచ్చీనంటా నేరుపుల దిరిగేవు
(॥పల్లవి॥)
నిన్ను మోఁచి వచ్చీనంటా నేరుపుల దిరిగేవు
సన్న లిట్టె సేసేవు నీజాడ నే నెఱఁగనా
(॥నిన్ను॥)
మొగమిచ్చ లాడలేక మోనాన నుండితిఁగాక
తగవులే పలికితే తగునననా
జగడించి యాపె నేను సాకిరి నిన్నడిగితే
నగవులు నవ్వేవు నీ నాటకాలెఱఁగనా
(॥నిన్ను॥)
యిచ్చకాలు సేయఁగాను యియ్యకోనైతిఁగాక
అచ్చముగా నడచితే నవునననా
మచ్చరించి యాపె నేను మంకులు దేరుచుమంటే
తచ్చనలు సే సేవు నీ తలఁపు లెఱఁగనా
(॥నిన్ను॥)
చలపట్టఁగా నీతో సాదించకుండితిఁగాక
యెలమి శ్రీ వేంకటేశ యిందుకనేనా
అలమేలుమంగను నిన్నాపె నేనుఁ బిలిచితే
కలసితి విద్దరిని కత లివెఱఁగనా
(||pallavi||)
ninnu mom̐si vachchīnaṁṭā nerubula dirigevu
sanna liṭṭĕ sesevu nījāḍa ne nĕṟam̐ganā
(||ninnu||)
mŏgamichcha lāḍalega monāna nuṁḍidim̐gāga
tagavule paligide tagunananā
jagaḍiṁchi yābĕ nenu sāgiri ninnaḍigide
nagavulu navvevu nī nāḍagālĕṟam̐ganā
(||ninnu||)
yichchagālu seyam̐gānu yiyyagonaidim̐gāga
achchamugā naḍaside navunananā
machchariṁchi yābĕ nenu maṁkulu derusumaṁṭe
tachchanalu se sevu nī talam̐pu lĕṟam̐ganā
(||ninnu||)
salabaṭṭam̐gā nīdo sādiṁchaguṁḍidim̐gāga
yĕlami śhrī veṁkaḍeśha yiṁduganenā
alamelumaṁganu ninnābĕ nenum̐ biliside
kalasidi viddarini kada livĕṟam̐ganā