Ninnu mettuno yaabe nerubulu mettuno

నిన్ను మెత్తునో యాపె నేరుపులు మెత్తునో
Language

(॥పల్లవి॥)
నిన్ను మెత్తునో యాపె నేరుపులు మెత్తునో
పన్నుగడలై ఇట్టె పరగీని వలపు*

(॥నిన్ను॥)
వారక యాసతి నీకు వావి నేమౌనోకాని
సారెకు నవ్వులు నవ్వీ చల్లీ వలపు
పొరచి నాకెకు నీకు పొందులెట్టివో కాని
పేరఁబెట్టి నీముందరఁ బెంచీని వలపు

(॥నిన్ను॥)
వువిదకు నీకుఁ దొల్లి వొడఁబా టెట్టిదోకాని
తవిరి సన్నలు సేసి తవ్వీ వలపు
జవళి మీలో మీకు సమ్మతు లెట్టివోకాని
రవళిఁ దమకముల రాసిపోసి వలపు

(॥నిన్ను॥)
కలసి యాపెకు నీకు కందువ లెట్టివోకాని
కెలసి కాఁగిటను బిగించీ వలపు
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి
కలికితనాలఁ బొత్తు గలసీని వలపు

(||pallavi||)
ninnu mĕttuno yābĕ nerubulu mĕttuno
pannugaḍalai iṭṭĕ paragīni valabu*

(||ninnu||)
vāraga yāsadi nīgu vāvi nemaunogāni
sārĕgu navvulu navvī sallī valabu
pŏrasi nāgĕgu nīgu pŏṁdulĕṭṭivo kāni
peram̐bĕṭṭi nīmuṁdaram̐ bĕṁchīni valabu

(||ninnu||)
vuvidagu nīgum̐ dŏlli vŏḍam̐bā ṭĕṭṭidogāni
taviri sannalu sesi tavvī valabu
javaḽi mīlo mīgu sammadu lĕṭṭivogāni
ravaḽim̐ damagamula rāsibosi valabu

(||ninnu||)
kalasi yābĕgu nīgu kaṁduva lĕṭṭivogāni
kĕlasi kām̐giḍanu bigiṁchī valabu
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
kaligidanālam̐ bŏttu galasīni valabu