Ninnu mamchivaamdavana nerudumu gaani nemu

నిన్ను మంచివాఁడవన నేరుతుము గాని నేము
Language

(॥పల్లవి॥)
నిన్ను మంచివాఁడవన నేరుతుము గాని నేము
సన్నలఁ దిట్టను వినఁజాలమయ్యా

(॥నిన్ను॥)
ఆవులమందలలోన ఆడుకొనేసుద్దులు
వేవేగ విట్ఠలుఁడ వినవయ్యా
చేవదేర నీదొంగచేఁతలెల్లా వీరు వారు
వోవవుచ్చే రివి విననోపమయ్యా

(॥నిన్ను॥)
కొలనికరత నీకు గురుతై నరవ్వలు
తలఁచుకో విట్ఠలుఁడ తగదయ్యా
యెలమిఁ బువ్వులవారి యింటికాడి నిందలు
తెలిపేరు యెట్టు సమ్మతింతుమయ్యా

(॥నిన్ను॥)
నిండార రుకుమిణి నీ కంపినలేకలు
పండరంగివిట్ఠలుఁడ పట్టవయ్యా
అండనే శ్రీవేంకటాద్రి నందరిఁ గూడితివి
యెండలెల్లా నీడలాయ నేమనేమయ్యా

(||pallavi||)
ninnu maṁchivām̐ḍavana nerudumu gāni nemu
sannalam̐ diṭṭanu vinam̐jālamayyā

(||ninnu||)
āvulamaṁdalalona āḍugŏnesuddulu
vevega viṭṭhalum̐ḍa vinavayyā
sevadera nīdŏṁgasem̐talĕllā vīru vāru
vovavuchche rivi vinanobamayyā

(||ninnu||)
kŏlanigarada nīgu gurudai naravvalu
talam̐sugo viṭṭhalum̐ḍa tagadayyā
yĕlamim̐ buvvulavāri yiṁṭigāḍi niṁdalu
tĕliberu yĕṭṭu sammadiṁtumayyā

(||ninnu||)
niṁḍāra rugumiṇi nī kaṁpinalegalu
paṁḍaraṁgiviṭṭhalum̐ḍa paṭṭavayyā
aṁḍane śhrīveṁkaḍādri naṁdarim̐ gūḍidivi
yĕṁḍalĕllā nīḍalāya nemanemayyā