Ninna kanibimchimdi nannu muribimchim

నిన్న కనిపించింది నన్ను మురిపించిం
Year
Language

పల్లవి:

నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అంద చందాల రాణి ఆ చిన్నది ||2||

చరణం 1:

ఆమె చిరునవ్వులోనే హాయున్నది ||2||
మనసు పులకించగా మధురభావాలు నాలోన కలిగించిందీ

చరణం 2:

మరచిపోలేను ఆ రూపు ఏనాటికి ||2||
మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి ||2||

తలచుకొనగానే ఎదో ఆనందము ||2||
వలపు జనియించగా ప్రణయగీతాలు నాచేత పాడించింది

చరణం 3:

సోగ కనులారా చూసింది సొంపారగా ||2||
మూగ కోరికలు చిగిరించే ఇంపారగా ||2||

నడచిపోయిందీ ఎంతో నాజూకుగా ||2||
విడచి మనజాలనూ విరహ తాపాలు మోహాలు రగిలించింది

pallavi:

ninna kanibiṁchiṁdi nannu muribiṁchiṁdi
aṁda saṁdāla rāṇi ā sinnadi ||2||

saraṇaṁ 1:

āmĕ sirunavvulone hāyunnadi ||2||
manasu pulagiṁchagā madhurabhāvālu nālona kaligiṁchiṁdī

saraṇaṁ 2:

marasibolenu ā rūbu enāḍigi ||2||
mamadalevevo sĕlarege idi emiḍi ||2||

talasugŏnagāne ĕdo ānaṁdamu ||2||
valabu janiyiṁchagā praṇayagīdālu nāseda pāḍiṁchiṁdi

saraṇaṁ 3:

soga kanulārā sūsiṁdi sŏṁpāragā ||2||
mūga korigalu sigiriṁche iṁpāragā ||2||

naḍasiboyiṁdī ĕṁto nājūgugā ||2||
viḍasi manajālanū viraha tābālu mohālu ragiliṁchiṁdi