నిండుజాణ వన్నిటాను నీవే యెఱుఁగుదువు
(॥పల్లవి॥)
నిండుజాణ వన్నిటాను నీవే యెఱుఁగుదువు
అండనుండి సతులచే నాడించుకోరాదు
(॥నిండు॥)
తలఁపుకొలఁదినే తమి రేఁచవలెఁగాని
వలపంతఁబెట్టరాదు వనితలను
పులక లెసఁగఁ గుచములు ముట్టవలెఁగాని
బలిమిఁ బిసికి తడఁబరచఁగరాదు
(॥నిండు॥)
కూరిములు దలకొన కురు లంటవలెఁగాని
బారెఁడేసి వెంట్రుకలు పట్టఁగరాదు
నేరుపుతోనే కాఁగిటనించి కూడవలెఁగాని
బీరానఁ గుదించి పిరివీకు సేయరాదు
(॥నిండు॥)
మోహముకొలఁదినే మోవి యానవలెఁగాని
సాహసాన పలు సోఁకించఁగరాదు
యీహల శ్రీవేంకటేశ ఇంతి నిట్టె యేలితివి
బాహుమూలా లంటి కడుఁ బచ్చిసేయరాదు
(||pallavi||)
niṁḍujāṇa vanniḍānu nīve yĕṟum̐guduvu
aṁḍanuṁḍi sadulase nāḍiṁchugorādu
(||niṁḍu||)
talam̐pugŏlam̐dine tami rem̐savalĕm̐gāni
valabaṁtam̐bĕṭṭarādu vanidalanu
pulaga lĕsam̐gam̐ gusamulu muṭṭavalĕm̐gāni
balimim̐ bisigi taḍam̐barasam̐garādu
(||niṁḍu||)
kūrimulu dalagŏna kuru laṁṭavalĕm̐gāni
bārĕm̐ḍesi vĕṁṭrugalu paṭṭam̐garādu
nerubudone kām̐giḍaniṁchi kūḍavalĕm̐gāni
bīrānam̐ gudiṁchi pirivīgu seyarādu
(||niṁḍu||)
mohamugŏlam̐dine movi yānavalĕm̐gāni
sāhasāna palu som̐kiṁcham̐garādu
yīhala śhrīveṁkaḍeśha iṁti niṭṭĕ yelidivi
bāhumūlā laṁṭi kaḍum̐ bachchiseyarādu