నిలువుఁ గొలువు లేల నివ్వెరగు లిఁకనేల
(॥పల్లవి॥)
నిలువుఁ గొలువు లేల నివ్వెరగు లిఁకనేల
చలము మాని విభునిఁ జక్కఁ జూడరాదా
(॥నిలు॥)
పంత మొక్కటేకాక పలుమాఁట లిఁకనేల
మంతనాన పతితో మాటాడరాదా
చింత లిన్నియునుఁ బాసె చెక్కునొక్కినప్పుడే
కొంత సెలవుల నవ్వి కూచుండరాదా
(॥నిలు॥)
వొడఁబా టొక్కటేకాక వున్నవిచారము లేల
బెడఁగులేక యాతనిఁ బిలువరాదా
కడమలిన్నియుఁ బాసె కప్పురమిచ్చినప్పుడే
విడువరానిపతికి విడెమియ్యరాదా
(॥నిలు॥)
కూటమి వొక్కటేకాక కొణఁత లింకానేల
చోటిచ్చి శ్రీవేంకటేశుఁ జొక్కించరాదా
బూటకములెల్లాఁ బాసె పొంది పొసఁగి నప్పుడే
పాటించి యాతని నిట్టె పచ్చి సేయరాదా
(||pallavi||)
niluvum̐ gŏluvu lela nivvĕragu lim̐kanela
salamu māni vibhunim̐ jakkam̐ jūḍarādā
(||nilu||)
paṁta mŏkkaḍegāga palumām̐ṭa lim̐kanela
maṁtanāna padido māḍāḍarādā
siṁta linniyunum̐ bāsĕ sĕkkunŏkkinappuḍe
kŏṁta sĕlavula navvi kūsuṁḍarādā
(||nilu||)
vŏḍam̐bā ṭŏkkaḍegāga vunnavisāramu lela
bĕḍam̐gulega yādanim̐ biluvarādā
kaḍamalinniyum̐ bāsĕ kappuramichchinappuḍe
viḍuvarānibadigi viḍĕmiyyarādā
(||nilu||)
kūḍami vŏkkaḍegāga kŏṇam̐ta liṁkānela
soḍichchi śhrīveṁkaḍeśhum̐ jŏkkiṁcharādā
būḍagamulĕllām̐ bāsĕ pŏṁdi pŏsam̐gi nappuḍe
pāḍiṁchi yādani niṭṭĕ pachchi seyarādā