నిక్కి నా తమకానకు నీవే కావలెఁగాక
(॥పల్లవి॥)
నిక్కి నా తమకానకు నీవే కావలెఁగాక
యెక్కువ నన్నిటు గావ నెవ్వరున్నా రిఁకను
(॥నిక్కి॥)
కోపగించి నిన్నయితేఁ గొసరుదు నేను నన్నుఁ
బైపైనే బుజ్జగించి పాయలేవు నీవు
చాపలాన గొణఁగుచు సాదింతు నే నిన్ను
తీపుమోవి నాకు విచ్చి తేలింతువు నీవు
(॥నిక్కి॥)
వేగిరించి విన్నయితే వెంగెమాడుదు నేను
బాగుగా నందుకు నీవు పకపక నవ్వుదువు
ఆగతి నడుగరానివైనా నడుగుదు నేను
సోగల సాదించి తెచ్చి చొక్కింతువు నీవు
(॥నిక్కి॥)
ముందుముందే కాలజిమ్మి మొక్కులు మొక్కుదు నేను
అందుకంటే మునుప నన్నాదరింతువు నీవు
ఇందుకే శ్రీవేంకటేశ యెనసితి నే నిన్ను
కందువలఁ గరఁగించి కైకొంటివి నీవు
(||pallavi||)
nikki nā tamagānagu nīve kāvalĕm̐gāga
yĕkkuva nanniḍu gāva nĕvvarunnā rim̐kanu
(||nikki||)
kobagiṁchi ninnayidem̐ gŏsarudu nenu nannum̐
baibaine bujjagiṁchi pāyalevu nīvu
sābalāna gŏṇam̐gusu sādiṁtu ne ninnu
tībumovi nāgu vichchi teliṁtuvu nīvu
(||nikki||)
vegiriṁchi vinnayide vĕṁgĕmāḍudu nenu
bāgugā naṁdugu nīvu pagabaga navvuduvu
āgadi naḍugarānivainā naḍugudu nenu
sogala sādiṁchi tĕchchi sŏkkiṁtuvu nīvu
(||nikki||)
muṁdumuṁde kālajimmi mŏkkulu mŏkkudu nenu
aṁdugaṁṭe munuba nannādariṁtuvu nīvu
iṁduge śhrīveṁkaḍeśha yĕnasidi ne ninnu
kaṁduvalam̐ garam̐giṁchi kaigŏṁṭivi nīvu