Nikka maanadiyyavayya nemdainanu

నిక్క మానతియ్యవయ్య నేఁడైనను
Language

(॥పల్లవి॥)
నిక్క మానతియ్యవయ్య నేఁడైనను
పక్కన నీసుద్దులెల్లఁ బచ్చిదేరీ నిపుడు

(॥నిక్కి॥)
వేడుక నీపలుకులు వినరానివేదాలు
కూడేది గొల్లెతలగుంపుఁగాఁగిలి
ఆడేటి దొకటి నీయసిమలోని దొకటి
యీడ నాతో నాడుమాఁట లివియైన నిజమా

(॥నిక్కి॥)
పూఁతలనీకతలెల్లఁ బుణ్యపుఁదెరువులె
చేఁతలు రుకుమిణిఁ దెచ్చినముచ్చిమి
వాఁత వ్రాసే దొకటియు వక్కణించే దొకటియు
బాఁతిపడి నీవుసేసేబాసలు నమ్ముదునా

(॥నిక్కి॥)
చేకొని నీవుండేది శ్రీవేంకటాచలము
ఆకడితలఁపులు పదారువేలు
యీకడఁ బలుకుఁబంత మెక్క నన్నుఁ గూడితివి
కాకరినీపనులే లోకమున సమ్మతము

(||pallavi||)
nikka mānadiyyavayya nem̐ḍainanu
pakkana nīsuddulĕllam̐ bachchiderī nibuḍu

(||nikki||)
veḍuga nībalugulu vinarānivedālu
kūḍedi gŏllĕdalaguṁpum̐gām̐gili
āḍeḍi dŏgaḍi nīyasimaloni dŏgaḍi
yīḍa nādo nāḍumām̐ṭa liviyaina nijamā

(||nikki||)
pūm̐talanīgadalĕllam̐ buṇyabum̐dĕruvulĕ
sem̐talu rugumiṇim̐ dĕchchinamuchchimi
vām̐ta vrāse dŏgaḍiyu vakkaṇiṁche dŏgaḍiyu
bām̐tibaḍi nīvusesebāsalu nammudunā

(||nikki||)
segŏni nīvuṁḍedi śhrīveṁkaḍāsalamu
āgaḍidalam̐pulu padāruvelu
yīgaḍam̐ balugum̐baṁta mĕkka nannum̐ gūḍidivi
kāgarinībanule logamuna sammadamu