Nijamu nerabaraadaa nemdu maadonu

నిజము నెరపరాదా నేఁడు మాతోను
Language

(॥పల్లవి॥)
నిజము నెరపరాదా నేఁడు మాతోను
గజరులు దెలిసితే కాఁతాళించేవు

(॥॥)
శిరసుపై తలఁబాలు చెంపల వెంటఁ గారి
తరుణిపేరడిగితే దాఁచేవు నాతో
గొరబైనవుంగరాలు కొంకక నీ వేళ్ల నివె
యిరవాయఁ బనులెల్లా నేలలోఁ గేవు

(॥॥)
కుంకుమగుబ్బలొత్తులు కుమ్మెలై రొమ్మున మించె
వుంకు వేమిచ్చితివంటే నూరకుండేవు
అంకెఁ బగడాలదండ అటె నీమొల నున్నది
లంకెలఁ బట్టఁబేతే నేలపెనఁ గేవు

(॥॥)
మెడఁ గట్టుకొంటి వలమేలుమంగ నింతలోనే
వొడి నెవ్వరున్నారంటే వొట్టు వెట్టేవు
నడుమ శ్రీ వేంకటేశ నన్నేలితి విపు డిట్టె
చిడుముడిఁ గదిమితే సిగ్గువడేవు

(||pallavi||)
nijamu nĕrabarādā nem̐ḍu mādonu
gajarulu dĕliside kām̐tāḽiṁchevu

(||||)
śhirasubai talam̐bālu sĕṁpala vĕṁṭam̐ gāri
taruṇiberaḍigide dām̐sevu nādo
gŏrabainavuṁgarālu kŏṁkaga nī veḽla nivĕ
yiravāyam̐ banulĕllā nelalom̐ gevu

(||||)
kuṁkumagubbalŏttulu kummĕlai rŏmmuna miṁchĕ
vuṁku vemichchidivaṁṭe nūraguṁḍevu
aṁkĕm̐ bagaḍāladaṁḍa aḍĕ nīmŏla nunnadi
laṁkĕlam̐ baṭṭam̐bede nelabĕnam̐ gevu

(||||)
mĕḍam̐ gaṭṭugŏṁṭi valamelumaṁga niṁtalone
vŏḍi nĕvvarunnāraṁṭe vŏṭṭu vĕṭṭevu
naḍuma śhrī veṁkaḍeśha nannelidi vibu ḍiṭṭĕ
siḍumuḍim̐ gadimide sigguvaḍevu