నిజ మాడఁబోతేను నీకు నీకే భ్రమసేవు
(॥పల్లవి॥)
నిజ మాడఁబోతేను నీకు నీకే భ్రమసేవు
భజన మెరసితిఁగా పంతమాడి నేను
(॥నిజ॥)
పలుకులో నొకటి భావములో నొకటి
కలికి నీగుణమెల్లాఁ గంటిఁగా నేను
తెలిసి చింతించేవు దినము లెంచుకొనేవు
యెలమి నీవూహలెల్ల నెఱిఁగితి నేను
(॥నిజ॥)
నగవులో నొకటి నడవడిలో నొకటి
వెగటైన నీకతలు వింటిఁగా నేను
పొగరుల నలసేపు పొదుదిక్కే చూచేవు
అగడైతి విందరిలో నంటిఁగా నేను
(॥నిజ॥)
కాఁగిటిలో నొకటి కాఁకలలో నొఁకటి
కీఁగంటఁజూచి యెఱిఁగితిఁగా నేను
దాఁగక శ్రీవేంకటేశ తగఁ గూడితివి నీవు
ఆఁగి నీసిగ్గు వాపితి నవుఁగా నేను
(||pallavi||)
nija māḍam̐bodenu nīgu nīge bhramasevu
bhajana mĕrasidim̐gā paṁtamāḍi nenu
(||nija||)
palugulo nŏgaḍi bhāvamulo nŏgaḍi
kaligi nīguṇamĕllām̐ gaṁṭim̐gā nenu
tĕlisi siṁtiṁchevu dinamu lĕṁchugŏnevu
yĕlami nīvūhalĕlla nĕṟim̐gidi nenu
(||nija||)
nagavulo nŏgaḍi naḍavaḍilo nŏgaḍi
vĕgaḍaina nīgadalu viṁṭim̐gā nenu
pŏgarula nalasebu pŏdudikke sūsevu
agaḍaidi viṁdarilo naṁṭim̐gā nenu
(||nija||)
kām̐giḍilo nŏgaḍi kām̐kalalo nŏm̐kaḍi
kīm̐gaṁṭam̐jūsi yĕṟim̐gidim̐gā nenu
dām̐gaga śhrīveṁkaḍeśha tagam̐ gūḍidivi nīvu
ām̐gi nīsiggu vābidi navum̐gā nenu