Niddirimcham bodduledu ninnum dalasa nebatte

నిద్దిరించఁ బొద్దులేదు నిన్నుఁ దలచ నేపట్టె
Language

(॥పల్లవి॥)
నిద్దిరించఁ బొద్దులేదు నిన్నుఁ దలచ నేపట్టె
సుద్దుల నీగుణముల సోద్యాల వల్లను

(॥నిద్ది॥)
చిత్తము చంచలమంది చిందువందుగానేపట్టే
బత్తి నీమీఁదఁ జేసిన ఫలమునను
యెత్తినశిరసుతో నీ కెదురుచూడనే పట్టె
హత్తిననీవు వచ్చేవనేయాసలాసలను

(॥నిద్ది॥)
వొడలెల్లఁ జెమరించి వుస్సురననే పట్టె
యెడమాట లాడించేఇందువంకనే
జడియుఁగన్నీటితో జాలిఁబడనేట్టె
తడతాఁకుఁ గోరికలతమకానను

(॥నిద్ది॥)
మిక్కిలిపరవశాన మేను మఱవఁగఁబట్టె
పిక్కటిల్లునీకాఁగిటిబిగువుననే
గక్కన శ్రీవేంకటేశ చెక్కులు మూయనేపట్టె
యిక్కువల నీవు సేసేయీచేఁతవల్లను

(||pallavi||)
niddiriṁcham̐ bŏdduledu ninnum̐ dalasa nebaṭṭĕ
suddula nīguṇamula sodyāla vallanu

(||niddi||)
sittamu saṁchalamaṁdi siṁduvaṁdugānebaṭṭe
batti nīmīm̐dam̐ jesina phalamunanu
yĕttinaśhirasudo nī kĕdurusūḍane paṭṭĕ
hattinanīvu vachchevaneyāsalāsalanu

(||niddi||)
vŏḍalĕllam̐ jĕmariṁchi vussuranane paṭṭĕ
yĕḍamāḍa lāḍiṁcheiṁduvaṁkane
jaḍiyum̐gannīḍido jālim̐baḍaneṭṭĕ
taḍadām̐kum̐ gorigaladamagānanu

(||niddi||)
mikkilibaravaśhāna menu maṟavam̐gam̐baṭṭĕ
pikkaḍillunīgām̐giḍibiguvunane
gakkana śhrīveṁkaḍeśha sĕkkulu mūyanebaṭṭĕ
yikkuvala nīvu seseyīsem̐tavallanu