Nichchaa nichchaa vitthalaa nee kela yee ṟattu

నిచ్చా నిచ్చా విట్ఠలా నీ కేల యీ ఱట్టు
Language

(॥పల్లవి॥)
నిచ్చా నిచ్చా విట్ఠలా నీ కేల యీ ఱట్టు
మచ్చము నేఁ జూపితేను మాతోనే నవ్వులా

(॥నిచ్చా॥)
వల్లెవాటు పైఁడిచీర వనిత శ్రీసతి నీకు
చల్లలమ్మేవారితోడ జాణతనాలా
చెల్లఁబో కొండ గొడుగుచేసి యెత్తేనీవు
గొల్లెతల చీరలెల్లాఁ గోరి ముచ్చిలేదా

(॥నిచ్చా॥)
అందరి నేలే గోపనందనుఁడ వైన నీవు
చెంది చీఁకటి తప్పులు సేయ బొయ్యేదా
గొందినే దేవతలు గొనియాడేదట నిన్ను
మందవారి పాలఁ జిక్కి నిందలఁ బడేదా

(॥నిచ్చా॥)
కొనబుకాఁడవు నీవు కొమి రెవయసు నేను
పనిలేక వొంటినుంటేఁ బైకొనేదా
ననుపై శ్రీవేంకటేశ నన్ను నిట్టె కూడితివి
మనలోఁ దగవు దేరె మరియింకాఁ గొసరా

(||pallavi||)
nichchā nichchā viṭṭhalā nī kela yī ṟaṭṭu
machchamu nem̐ jūbidenu mādone navvulā

(||nichchā||)
vallĕvāḍu paim̐ḍisīra vanida śhrīsadi nīgu
sallalammevāridoḍa jāṇadanālā
sĕllam̐bo kŏṁḍa gŏḍugusesi yĕttenīvu
gŏllĕdala sīralĕllām̐ gori muchchiledā

(||nichchā||)
aṁdari nele gobanaṁdanum̐ḍa vaina nīvu
sĕṁdi sīm̐kaḍi tappulu seya bŏyyedā
gŏṁdine devadalu gŏniyāḍedaḍa ninnu
maṁdavāri pālam̐ jikki niṁdalam̐ baḍedā

(||nichchā||)
kŏnabugām̐ḍavu nīvu kŏmi rĕvayasu nenu
panilega vŏṁṭinuṁṭem̐ baigŏnedā
nanubai śhrīveṁkaḍeśha nannu niṭṭĕ kūḍidivi
manalom̐ dagavu derĕ mariyiṁkām̐ gŏsarā