నేవచ్చిన పనేమి నీవు సేసిన చేఁతేమి
(॥పల్లవి॥)
నేవచ్చిన పనేమి నీవు సేసిన చేఁతేమి
ఆవలఁ జెలేమనునో అవునయ్య చాలును
(॥నేవ॥)
పిలిచేవ నుంటిఁగాని పెనఁగే దెఱఁగనైతి
చెలిక త్తెఁ బచ్చి సేయఁ జెల్లునా నీకు
తొలుతే వేడుక కాఁడు దోస మెఱఁగఁ డనేటిఁ
పలుకు నీయందే కంటిఁ బదవయ్య చాలును
(॥నేవ॥)
నగేవంటా నుంటిఁగాని నాకుఁ జేయిచాఁచే దెఱఁగ
జిగినేస్త కత్తెనంటా జెల్లునా నీకు
జగములోన వలపు చవెఱఁగ దన్నమాట
తగవు నీయందే కంటిఁ దలవయ్య చాలును
(॥నేవ॥)
వూరకంటా నుంటిగాని వొడివట్టే దెఱఁగను
చేరి దూతికిల గూడ జెల్లునా నీకు
అరయ శ్రీవేంకటేశ అట్టె నను గూడితివి
మేరమీరితిని నీవు మేలయ్య చాలును
(||pallavi||)
nevachchina panemi nīvu sesina sem̐temi
āvalam̐ jĕlemanuno avunayya sālunu
(||neva||)
piliseva nuṁṭim̐gāni pĕnam̐ge dĕṟam̐ganaidi
sĕliga ttĕm̐ bachchi seyam̐ jĕllunā nīgu
tŏlude veḍuga kām̐ḍu dosa mĕṟam̐gam̐ ḍaneḍim̐
palugu nīyaṁde kaṁṭim̐ badavayya sālunu
(||neva||)
nagevaṁṭā nuṁṭim̐gāni nāgum̐ jeyisām̐se dĕṟam̐ga
jiginesta kattĕnaṁṭā jĕllunā nīgu
jagamulona valabu savĕṟam̐ga dannamāḍa
tagavu nīyaṁde kaṁṭim̐ dalavayya sālunu
(||neva||)
vūragaṁṭā nuṁṭigāni vŏḍivaṭṭe dĕṟam̐ganu
seri dūdigila gūḍa jĕllunā nīgu
araya śhrīveṁkaḍeśha aṭṭĕ nanu gūḍidivi
meramīridini nīvu melayya sālunu