నెట్టుకొన్న మగఁడవు నీవే కదా
(॥పల్లవి॥)
నెట్టుకొన్న మగఁడవు నీవే కదా
యిట్టె నేఁ బదరఁగా యేమాయ నాకును
(॥నెట్టు॥)
పంగించి నిన్ను బలిమిఁబట్టి పెనఁగఁగనేల
సంగడివారితో పాటు చాలదా నాకు
యింగిత మెఱిఁగి నేనిట్టె వుంటే మేలుగాక
యెంగిలి సేసుకోఁగా యేమాయ నాకును
(॥నెట్టు॥)
వాదడిచి నిన్నుఁ గడువంచుక తిరుగనేల
సాదననిపించుకొంట చాలదా నాకు
నీదయ గోరుకవుంటే నీవే మెచ్చేవు గాక
యేదియని కొసరఁగా నేమాయ నాకును
(॥నెట్టు॥)
సలిగె శ్రీవేంకటేశ సారె నీతోఁ జెప్పనేల
అలమేలుమంగవార మౌట చాలదా
వలపుతో నేనుంటే వచ్చి కూడితివి గాక
యెలమి రట్టు సేయఁగా నేమాయ నాకును
(||pallavi||)
nĕṭṭugŏnna magam̐ḍavu nīve kadā
yiṭṭĕ nem̐ badaram̐gā yemāya nāgunu
(||nĕṭṭu||)
paṁgiṁchi ninnu balimim̐baṭṭi pĕnam̐gam̐ganela
saṁgaḍivārido pāḍu sāladā nāgu
yiṁgida mĕṟim̐gi neniṭṭĕ vuṁṭe melugāga
yĕṁgili sesugom̐gā yemāya nāgunu
(||nĕṭṭu||)
vādaḍisi ninnum̐ gaḍuvaṁchuga tiruganela
sādananibiṁchugŏṁṭa sāladā nāgu
nīdaya gorugavuṁṭe nīve mĕchchevu gāga
yediyani kŏsaram̐gā nemāya nāgunu
(||nĕṭṭu||)
saligĕ śhrīveṁkaḍeśha sārĕ nīdom̐ jĕppanela
alamelumaṁgavāra mauḍa sāladā
valabudo nenuṁṭe vachchi kūḍidivi gāga
yĕlami raṭṭu seyam̐gā nemāya nāgunu