నేరుపులు పచరించ నే నీతోనా
(॥పల్లవి॥)
నేరుపులు పచరించ నే నీతోనా
ఆరితేరిన పనుల కమ్మరో నీతోనా
(॥నేరు॥)
దిట్టవై మాటలాడేవు తెలుపుమంటా వచ్చేవు
నెట్టన జగడాలకు నే నీతోనా
పట్టిన చలముతో యీ పనులకే తిరిగేవు
మట్టుమీరి మాటలాడ మరి నీతోనా
(॥నేరు॥)
పన్ని విందు లడిగేవు పంతములాడ వచ్చేవు
నిన్ను రమ్మని పిలువ నే నీతోనా
ఇన్నేసి నేరకుండితే యింతవాఁడవేలయ్యేవు
సన్నల నే నవ్వు నవ్వ సరి నీతోనా
(॥నేరు॥)
బద్దులకుఁ బవళించి పాదాలు గుద్దుమనేవు
నిద్దుర వట్టించ నేఁడు నే నీతోనా
గద్దరి శ్రీ వేంకటేశ కాఁగిటఁ గూడితి నన్ను
కొద్దిమీరి రతుల దీకొన నీతోనా
(||pallavi||)
nerubulu pasariṁcha ne nīdonā
āriderina panula kammaro nīdonā
(||neru||)
diṭṭavai māḍalāḍevu tĕlubumaṁṭā vachchevu
nĕṭṭana jagaḍālagu ne nīdonā
paṭṭina salamudo yī panulage tirigevu
maṭṭumīri māḍalāḍa mari nīdonā
(||neru||)
panni viṁdu laḍigevu paṁtamulāḍa vachchevu
ninnu rammani piluva ne nīdonā
innesi neraguṁḍide yiṁtavām̐ḍavelayyevu
sannala ne navvu navva sari nīdonā
(||neru||)
baddulagum̐ bavaḽiṁchi pādālu guddumanevu
niddura vaṭṭiṁcha nem̐ḍu ne nīdonā
gaddari śhrī veṁkaḍeśha kām̐giḍam̐ gūḍidi nannu
kŏddimīri radula dīgŏna nīdonā