నేరుపుతో నీదాననై నిండుకుండేను
(॥పల్లవి॥)
నేరుపుతో నీదాననై నిండుకుండేను
వోరికొట్లు గొట్ట ని న్నోపమయ్యా
(॥నేరు॥)
వాసికి రేఁచుక తిట్టి వంగివంగి మొక్కఁబట్టె
యీసుల నీతోడివాదులేలయ్య మాకు
చేసూటి నీతోఁ బెనఁగి చెక్కులు నొక్కఁగఁబట్టె
వోసరించి నిన్నొరయనోపమయ్యా
(॥నేరు॥)
కన్నులను జంకించి కడువేఁడుకొనఁబట్టె
యెన్నిక నీతోనలుగనేలయ్య మాకు
పన్నినీతో మచ్చరించి పంతములియ్యఁగఁబట్టె
వున్నతితో మాట మీరనోపమయ్యా
(॥నేరు॥)
చలముసాదించఁబోయి చవులు చూపఁబట్టె
యెలమినిను గద్దించనేలయ్య మాకు
అలమేలుమంగను నేనదెశ్రీవేంకటేశుఁడ
వొలిసి కూడితిఁ బాయనోపమయ్యా
(||pallavi||)
nerubudo nīdānanai niṁḍuguṁḍenu
vorigŏṭlu gŏṭṭa ni nnobamayyā
(||neru||)
vāsigi rem̐suga tiṭṭi vaṁgivaṁgi mŏkkam̐baṭṭĕ
yīsula nīdoḍivādulelayya māgu
sesūḍi nīdom̐ bĕnam̐gi sĕkkulu nŏkkam̐gam̐baṭṭĕ
vosariṁchi ninnŏrayanobamayyā
(||neru||)
kannulanu jaṁkiṁchi kaḍuvem̐ḍugŏnam̐baṭṭĕ
yĕnniga nīdonaluganelayya māgu
panninīdo machchariṁchi paṁtamuliyyam̐gam̐baṭṭĕ
vunnadido māḍa mīranobamayyā
(||neru||)
salamusādiṁcham̐boyi savulu sūbam̐baṭṭĕ
yĕlamininu gaddiṁchanelayya māgu
alamelumaṁganu nenadĕśhrīveṁkaḍeśhum̐ḍa
vŏlisi kūḍidim̐ bāyanobamayyā