నేరుపరియౌ నీపె నెలఁతలలో నెల్లా
(॥పల్లవి॥)
నేరుపరియౌ నీపె నెలఁతలలో నెల్లా
వూరకె నడుము దూరి వొట్టికాయ నీకును
(॥నేరు॥)
పయ్యద చెరఁగు జారఁ బగటుతోడుత వచ్చి
వొయ్యనే మగువ నీ వొద్దఁ గూచుండె
యియ్యడ నీకేమవునో యెంతపని గలిగెనో
నెయ్యాన నీతన సంది నేస్తమెల్లాఁ జూపెను
(॥నేరు॥)
కంకణాలు గదలఁగా కడుసలిగె తోడుత
పంకించక ఇదివో నీ పాదా లొత్తెను
వుంకువ యేమిగొనెనో వొడఁబడి కెట్టిదో
అంకెఁ దనచుట్టరికమంతా నేఁడు చూపెను
(॥నేరు॥)
గందపుబేంట్లు రాల గబ్బితనముననే
కందువ దెలిపి నిన్ను కాఁగిలించెను
చందముతో శ్రీ వేంకటేశ్వర నన్నుఁ గూడితివి
ఇందులకే మెచ్చి తనఇతవెలాఁ జూపెను
(||pallavi||)
nerubariyau nībĕ nĕlam̐talalo nĕllā
vūragĕ naḍumu dūri vŏṭṭigāya nīgunu
(||neru||)
payyada sĕram̐gu jāram̐ bagaḍudoḍuda vachchi
vŏyyane maguva nī vŏddam̐ gūsuṁḍĕ
yiyyaḍa nīgemavuno yĕṁtabani galigĕno
nĕyyāna nīdana saṁdi nestamĕllām̐ jūbĕnu
(||neru||)
kaṁkaṇālu gadalam̐gā kaḍusaligĕ toḍuda
paṁkiṁchaga idivo nī pādā lŏttĕnu
vuṁkuva yemigŏnĕno vŏḍam̐baḍi kĕṭṭido
aṁkĕm̐ danasuṭṭarigamaṁtā nem̐ḍu sūbĕnu
(||neru||)
gaṁdabubeṁṭlu rāla gabbidanamunane
kaṁduva dĕlibi ninnu kām̐giliṁchĕnu
saṁdamudo śhrī veṁkaḍeśhvara nannum̐ gūḍidivi
iṁdulage mĕchchi tana̮idavĕlām̐ jūbĕnu