నేరుపరిన్నిటా నీపె నీకే తగు
(॥పల్లవి॥)
నేరుపరిన్నిటా నీపె నీకే తగు
సారపు చక్కెరబొమ్మ చంద మిట్టిదయ్యా
(॥నేరు॥)
బంగారువంటిది చెలి పదారుగళల మించు
ముంగారుమొయిలువంటిది ముద్దుగురుసు
అంగపుహంసవంటిది యడుగులు పెట్టేచోట
రంగుగ నీకు నేమని రచ్చఁ బొగడేమయ్యా
(॥నేరు॥)
కోవిలవంటిది సతి కోమలపు టెలుఁగున
పూవువంటిది వాసనబుగులుకొను
పావురమువంటిది గొబ్బనఁ బిలుపనకువచ్చు
వేవేల కీపె నేగతి విసుతించేమయ్యా
(॥నేరు॥)
చిలుకవంటిది యింతి చేరి పలుకఁగ నేర్చు
చిలుకవంటిది రతిఁ జిక్కించుఁ గూడి
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశుఁడ
యెలమి నీకెఁ గూడితి వెంతగొనాడేమయ్యా
(||pallavi||)
nerubarinniḍā nībĕ nīge tagu
sārabu sakkĕrabŏmma saṁda miṭṭidayyā
(||neru||)
baṁgāruvaṁṭidi sĕli padārugaḽala miṁchu
muṁgārumŏyiluvaṁṭidi muddugurusu
aṁgabuhaṁsavaṁṭidi yaḍugulu pĕṭṭesoḍa
raṁguga nīgu nemani rachcham̐ bŏgaḍemayyā
(||neru||)
kovilavaṁṭidi sadi komalabu ṭĕlum̐guna
pūvuvaṁṭidi vāsanabugulugŏnu
pāvuramuvaṁṭidi gŏbbanam̐ bilubanaguvachchu
vevela kībĕ negadi visudiṁchemayyā
(||neru||)
silugavaṁṭidi yiṁti seri palugam̐ga nersu
silugavaṁṭidi radim̐ jikkiṁchum̐ gūḍi
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhum̐ḍa
yĕlami nīgĕm̐ gūḍidi vĕṁtagŏnāḍemayyā