Nerubarinamtaanu nikke vimdarilona

నేరుపరినంటాను నిక్కే విందరిలోన
Language

(॥పల్లవి॥)
నేరుపరినంటాను నిక్కే విందరిలోన
గారవించి రమణునిఁ గరఁగించవలదా

(॥॥)
మలసి మలసి కడుమాటలాడ నేర్తునంటా
సొలనే వాతని సారె జూటుఁదనాన
వలచి ఇంతేసి బత్తిగలిగినదానవు
యెలమి నాతనియిచ్చ యెఱఁగఁగవలదా

(॥॥)
చేరి చేరి నీవప్పటి చెనకఁగనేర్తునంటా
గోరు దాఁకించవచ్చేవు గుట్టుతోడను
కూరిమితో నింతేసికూటమిగలదానవు
బోరున నాతని నిట్టె బుజ్జగించవలదా

(॥॥)
ననిచి ననిచి నీవు నవ్వఁగనేరుతునంటా
చనుఁగవ దాఁకించేవు సమరతుల
యెనసీ శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
ననువలెఁ గాఁగిటఁ బెనఁగఁగవలదా

(||pallavi||)
nerubarinaṁṭānu nikke viṁdarilona
gāraviṁchi ramaṇunim̐ garam̐giṁchavaladā

(||||)
malasi malasi kaḍumāḍalāḍa nerdunaṁṭā
sŏlane vādani sārĕ jūḍum̐danāna
valasi iṁtesi battigaliginadānavu
yĕlami nādaniyichcha yĕṟam̐gam̐gavaladā

(||||)
seri seri nīvappaḍi sĕnagam̐ganerdunaṁṭā
goru dām̐kiṁchavachchevu guṭṭudoḍanu
kūrimido niṁtesigūḍamigaladānavu
boruna nādani niṭṭĕ bujjagiṁchavaladā

(||||)
nanisi nanisi nīvu navvam̐ganerudunaṁṭā
sanum̐gava dām̐kiṁchevu samaradula
yĕnasī śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
nanuvalĕm̐ gām̐giḍam̐ bĕnam̐gam̐gavaladā