Nerubari vauduvu nerajaanavoo nauduvu

నేరుపరి వౌదువు నెరజాణవూ నౌదువు
Language

(॥పల్లవి॥)
నేరుపరి వౌదువు నెరజాణవూ నౌదువు
మేరతోనే చిత్తము రా మెలఁగితి వౌనే

(॥నేరు॥)
సరసములాడుకొంటా చవులెల్లా రేఁచుకొంటా
మరిగించికొంటి వౌనే మగనిని
గరిమతో నూరఁగలకఁ లెల్లాఁ జెప్పిచెప్పి
సోరిది నేపొద్దు నిట్టే చొక్కించితి వౌనే

(॥నేరు॥)
మొగము చూపిచూపి మోహములు చల్లిచల్లి
తగులుసేసుకొంటివే తతి నాతని
నగుతానే గుబ్బలకొనల నోరసియొరసి
మిగులా వేడుకసేసి మెప్పించితి వౌనే

(॥నేరు॥)
కోసరికోసరి మొక్కి వసముసేసుకొంటివి
వెస నలమేల్మంగ శ్రీవేంకటేశ్వరు
సుసరాన నేపొద్దు జోడువాయక వుండి
పోసఁగి రతుల నిట్టే భోగించితి వౌనే

(||pallavi||)
nerubari vauduvu nĕrajāṇavū nauduvu
meradone sittamu rā mĕlam̐gidi vaune

(||neru||)
sarasamulāḍugŏṁṭā savulĕllā rem̐sugŏṁṭā
marigiṁchigŏṁṭi vaune maganini
garimado nūram̐galagam̐ lĕllām̐ jĕppisĕppi
soridi nebŏddu niṭṭe sŏkkiṁchidi vaune

(||neru||)
mŏgamu sūbisūbi mohamulu sallisalli
tagulusesugŏṁṭive tadi nādani
nagudāne gubbalagŏnala norasiyŏrasi
migulā veḍugasesi mĕppiṁchidi vaune

(||neru||)
kosarigosari mŏkki vasamusesugŏṁṭivi
vĕsa nalamelmaṁga śhrīveṁkaḍeśhvaru
susarāna nebŏddu joḍuvāyaga vuṁḍi
posam̐gi radula niṭṭe bhogiṁchidi vaune