Nerubari vannidaanu nerajaanavu

నేరుపరి వన్నిటాను నెరజాణవు
Language

(॥పల్లవి॥)
నేరుపరి వన్నిటాను నెరజాణవు
యీ రమణి తెఱఁగు నీ వెఱుఁగుకోవయ్యా

(॥నేరు॥)
కలువలు పైఁజల్లె కమలము లందిఇచ్చె
ములువాఁడిజాజులు మోపుగట్టె
చెలమ లూటకుఁబెట్టె చింతలచిగురుఁగోనె
చెలియభావము నీవు చిత్తగించవయ్యా

(॥నేరు॥)
వెన్నెలలు ముగ్గువెట్టె విరుగాలి తూరుపెత్తె
పన్నుకొని నిమ్మపండ్లు పట్టెఁ గానుక
చిన్నితుమ్మిదల రేఁచె చిలుకలఁ బలికించె
కన్నెచందములు నీవు కనుగొనవయ్యా

(॥నేరు॥)
తేనెలు పెరలదించె తీగెలను వల్లెవేసె
ఆనుకొని చంద్రకళ లంగడిఁదోసె
పూని శ్రీవేంకటేశుఁడ పొంచి నీపై సేసవెట్టె
మానిని నేలితివి మఱఁగు లేటిఁవయ్యా

(||pallavi||)
nerubari vanniḍānu nĕrajāṇavu
yī ramaṇi tĕṟam̐gu nī vĕṟum̐gugovayyā

(||neru||)
kaluvalu paim̐jallĕ kamalamu laṁdiichchĕ
muluvām̐ḍijājulu mobugaṭṭĕ
sĕlama lūḍagum̐bĕṭṭĕ siṁtalasigurum̐gonĕ
sĕliyabhāvamu nīvu sittagiṁchavayyā

(||neru||)
vĕnnĕlalu mugguvĕṭṭĕ virugāli tūrubĕttĕ
pannugŏni nimmabaṁḍlu paṭṭĕm̐ gānuga
sinnidummidala rem̐sĕ silugalam̐ baligiṁchĕ
kannĕsaṁdamulu nīvu kanugŏnavayyā

(||neru||)
tenĕlu pĕraladiṁchĕ tīgĕlanu vallĕvesĕ
ānugŏni saṁdragaḽa laṁgaḍim̐dosĕ
pūni śhrīveṁkaḍeśhum̐ḍa pŏṁchi nībai sesavĕṭṭĕ
mānini nelidivi maṟam̐gu leḍim̐vayyā