Nerubari namduvu nerajaana namduvu

నేరుపరి నందువు నెరజాణ నందువు
Language

(॥పల్లవి॥)
నేరుపరి నందువు నెరజాణ నందువు
వీరిడి యాసలు వెల్లవిరి సేతురటవే

(॥నేరు॥)
నలిరేఁగి పతితోడ నవ్వులేమినవ్వేవే
కలికితనాల నెంత గయ్యాళించేవే
కొలమునాలవు కడుగుట్టుతో నుందువుగాక
వెలయాలివలె నెంత వేసాలుసేసేవే

(॥నేరు॥)
సంగడిఁ గూచుండి యేమిజాణతనా లాడేవే
కొంగువట్టి సారె నేమి కొచ్చితీసేవే
రంగయిన పెండ్లికూఁతురవు సిగ్గువలెఁగాక
అంగడిజంతవలె నాస లెంత చూపవే

(॥నేరు॥)
వాడికలు చూపిచూపి వలపు లెంతచల్లేవే
వీడని యలమేల్‌మంగవిభుఁ డితఁడు
కూడినాఁడు నన్ను విట్టె కోరి శ్రీవేంకటేశుఁడు
వేడుకకత్తేవలె వింత లేమిసేసేవే

(||pallavi||)
nerubari naṁduvu nĕrajāṇa naṁduvu
vīriḍi yāsalu vĕllaviri seduraḍave

(||neru||)
nalirem̐gi padidoḍa navvuleminavveve
kaligidanāla nĕṁta gayyāḽiṁcheve
kŏlamunālavu kaḍuguṭṭudo nuṁduvugāga
vĕlayālivalĕ nĕṁta vesāluseseve

(||neru||)
saṁgaḍim̐ gūsuṁḍi yemijāṇadanā lāḍeve
kŏṁguvaṭṭi sārĕ nemi kŏchchidīseve
raṁgayina pĕṁḍligūm̐turavu sigguvalĕm̐gāga
aṁgaḍijaṁtavalĕ nāsa lĕṁta sūbave

(||neru||)
vāḍigalu sūbisūbi valabu lĕṁtasalleve
vīḍani yalamel‌maṁgavibhum̐ ḍidam̐ḍu
kūḍinām̐ḍu nannu viṭṭĕ kori śhrīveṁkaḍeśhum̐ḍu
veḍugagattevalĕ viṁta lemiseseve