Nerubari namduvu nelamtalalonellaa

నేరుపరి నందువు నెలఁతలలోనెల్లా
Language

(॥పల్లవి॥)
నేరుపరి నందువు నెలఁతలలోనెల్లా
కూరిమెంత గలిగినా కొసరఁగవచ్చునా

(॥నేరు॥)
వలచినదాననంటా వాసిక త్తెనంటాను
చెలరేఁగి పతితోడఁ జెప్పేవు నీవు
చలివాసివుందానవు చన వెంత గలిగినా
పొలంతికి తన్నుఁ దానే పొగడుకోవచ్చునా

(॥నేరు॥)
నిన్నే నమ్మితి నంటా నేం బాయనోపనంటా
యెన్నేసివేసాలు సేసే విప్పుడే నీవు
పన్నుకొని వచ్చితివి బలిమికత్తెవైతేను
కన్నియకు నింతేసి కరతలు గలవా

(॥నేరు॥)
చేయెత్తి మొక్కతినంటా సిగ్గుతో నుందాననంటా
ఆయములంటి కూడితి వంతలో నీవు
యీయెడ శ్రీవేంకటేశుఁ డేలె నన్ను దొరవైతే
పాయపుదానికి నింత పచ్చిసేయఁదగునా

(||pallavi||)
nerubari naṁduvu nĕlam̐talalonĕllā
kūrimĕṁta galiginā kŏsaram̐gavachchunā

(||neru||)
valasinadānanaṁṭā vāsiga ttĕnaṁṭānu
sĕlarem̐gi padidoḍam̐ jĕppevu nīvu
salivāsivuṁdānavu sana vĕṁta galiginā
pŏlaṁtigi tannum̐ dāne pŏgaḍugovachchunā

(||neru||)
ninne nammidi naṁṭā neṁ bāyanobanaṁṭā
yĕnnesivesālu sese vippuḍe nīvu
pannugŏni vachchidivi balimigattĕvaidenu
kanniyagu niṁtesi karadalu galavā

(||neru||)
seyĕtti mŏkkadinaṁṭā siggudo nuṁdānanaṁṭā
āyamulaṁṭi kūḍidi vaṁtalo nīvu
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu dŏravaide
pāyabudānigi niṁta pachchiseyam̐dagunā