నెరవాది రమణుఁడ నీదే భాగ్యము
(॥పల్లవి॥)
నెరవాది రమణుఁడ నీదే భాగ్యము
వొరిమ నీ కందరు వొక్కటై వున్నారు
(॥నెర॥)
గరగరనియాఁటది గడుఁజేసూటై యుండితే
వరుసఁ గూడేటిమొగవానిభాగ్యము
ఇరవునయిటుగాక యెరవెరవై వుండితే
పరగ నందుకంటె పాపములేదు
(॥నెర॥)
చక్కనిరమణి రతిచవులు వుట్టించఁగాను
చొక్కమై కూడేటిసరసునిభాగ్యము
వెక్కసము యిటుగాక విరసాలు నెరపితే
పక్కన నందుకంటె పాపములేదు
(॥నెర॥)
పాయపుదానను నీపాదాలసేవ సేయఁగ
నీయందే మెచ్చఁగలిగె నీభాగ్యము
యీయెడ శ్రీవేంకటేశ యిటుగాక మరెవ్వరు
పాయుమన్ననందుకంటె పాపములేదు
(||pallavi||)
nĕravādi ramaṇum̐ḍa nīde bhāgyamu
vŏrima nī kaṁdaru vŏkkaḍai vunnāru
(||nĕra||)
garagaraniyām̐ṭadi gaḍum̐jesūḍai yuṁḍide
varusam̐ gūḍeḍimŏgavānibhāgyamu
iravunayiḍugāga yĕravĕravai vuṁḍide
paraga naṁdugaṁṭĕ pābamuledu
(||nĕra||)
sakkaniramaṇi radisavulu vuṭṭiṁcham̐gānu
sŏkkamai kūḍeḍisarasunibhāgyamu
vĕkkasamu yiḍugāga virasālu nĕrabide
pakkana naṁdugaṁṭĕ pābamuledu
(||nĕra||)
pāyabudānanu nībādālaseva seyam̐ga
nīyaṁde mĕchcham̐galigĕ nībhāgyamu
yīyĕḍa śhrīveṁkaḍeśha yiḍugāga marĕvvaru
pāyumannanaṁdugaṁṭĕ pābamuledu