నెఱజాణవు ఇవి నీవే యెఱుఁగుదువు
(॥పల్లవి॥)
నెఱజాణవు ఇవి నీవే యెఱుఁగుదువు
మెఱయఁ జెలులు నిన్ను మెచ్చిరి యిపుడు
(॥నెఱ॥)
వసమై వలచినవలపులలోనికి
కొసరెడుచిరుసిగ్గులు చవులు
పోసఁగఁగఁ జేసినపొందులలోనికి
సురపుసళుపులచూపులు చవులు
(॥నెఱ॥)
మనసుననాటినమచ్చికలోనికి
గునియు రతులపలుకులు చవులు
పెనగొనుసరసపుప్రియములలోనికి
ననిచిన సెలవులనవ్వులు చవులు
(॥నెఱ॥)
అలరి పొదలునడియాసలలోనికి
పొలుపగు తమకపుపొందులు చవులు
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశ
నిలయ నీకు నీచెలుములు చవులు
(||pallavi||)
nĕṟajāṇavu ivi nīve yĕṟum̐guduvu
mĕṟayam̐ jĕlulu ninnu mĕchchiri yibuḍu
(||nĕṟa||)
vasamai valasinavalabulalonigi
kŏsarĕḍusirusiggulu savulu
posam̐gam̐gam̐ jesinabŏṁdulalonigi
surabusaḽubulasūbulu savulu
(||nĕṟa||)
manasunanāḍinamachchigalonigi
guniyu radulabalugulu savulu
pĕnagŏnusarasabupriyamulalonigi
nanisina sĕlavulanavvulu savulu
(||nĕṟa||)
alari pŏdalunaḍiyāsalalonigi
pŏlubagu tamagabubŏṁdulu savulu
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśha
nilaya nīgu nīsĕlumulu savulu