నెఱజాణతనముల నేరుపరి యాతఁడు
(॥పల్లవి॥)
నెఱజాణతనముల నేరుపరి యాతఁడు
కఱకరిఁ బెట్టకే కరఁగించఁగదవే
(॥నెఱ॥)
చలము లేమిటికే సరసములాడేవేళ
సొలసి వినయములే చూపఁగరాదా
పెలుచుఁదనములేలే బెరసియుండేవేళ
వెలలేనినగవులు వెదచల్లఁగదవే
(॥నెఱ॥)
పంతములేఁటికే మాటపలుకు లాడేవేళ
చెంతనుండి ప్రియములే చెప్పఁగరాదా
వింతలు సేయంగనేలే వేడుకఁ జెనకేవేళ
సంతసానఁ బొందులెల్లా జరపఁగఁగదవే
(॥నెఱ॥)
జంకెన లేమిటికే సన్నలుసేసేవేళ
పొంకపుకాఁగిట నిట్టె పొదుగరాదా
అంకెల శ్రీంవేకటేశుఁ డన్నిటాను నిన్ను నేలె
కంకణాలచేతులనుఁ గాఁగిలించఁగదవే
(||pallavi||)
nĕṟajāṇadanamula nerubari yādam̐ḍu
kaṟagarim̐ bĕṭṭage karam̐giṁcham̐gadave
(||nĕṟa||)
salamu lemiḍige sarasamulāḍeveḽa
sŏlasi vinayamule sūbam̐garādā
pĕlusum̐danamulele bĕrasiyuṁḍeveḽa
vĕlaleninagavulu vĕdasallam̐gadave
(||nĕṟa||)
paṁtamulem̐ṭige māḍabalugu lāḍeveḽa
sĕṁtanuṁḍi priyamule sĕppam̐garādā
viṁtalu seyaṁganele veḍugam̐ jĕnageveḽa
saṁtasānam̐ bŏṁdulĕllā jarabam̐gam̐gadave
(||nĕṟa||)
jaṁkĕna lemiḍige sannaluseseveḽa
pŏṁkabugām̐giḍa niṭṭĕ pŏdugarādā
aṁkĕla śhrīṁvegaḍeśhum̐ ḍanniḍānu ninnu nelĕ
kaṁkaṇālasedulanum̐ gām̐giliṁcham̐gadave