Nerajaana vannidaanu nerubarivi

నెరజాణ వన్నిటాను నేరుపరివి
Language

(॥పల్లవి॥)
నెరజాణ వన్నిటాను నేరుపరివి
తరుణుల మన్నించే తగ వెఱుఁగుదువు

(॥నెర॥)
కొచ్చి కొచ్చి బత్తితోడఁ గొలువులు సేసే నీకు
ఇచ్చకములాడెఁ జెలి ఇందాఁకాను
మచ్చికతోఁ గొప్పు దువ్వి మనసెల్లాఁ గరఁగించె
మెచ్చవయ్యా ఇఁకనైనా మేలెరిఁగి నీవు

(॥నెర॥)
పయ్యెద చెరఁగు జార పలుమారు బాదాలొత్తె
నెయ్యములే పచరించె నిన్నటనుండి
వొయ్యనే గందమువూసి వుచిత మెల్లా నెరపె
యియ్యవయ్యా వుడుగర లితవెరిఁగి నీవు

(॥నెర॥)
వీడెమిచ్చి మోవితేనె విందువెట్టి లాలనతో
వేడుకలే పచరించె వేగి నంతాను
యీడనే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీకెఁ
గూడవయ్యా పొందుల గురుతెరిఁగి నీవు

(||pallavi||)
nĕrajāṇa vanniḍānu nerubarivi
taruṇula manniṁche taga vĕṟum̐guduvu

(||nĕra||)
kŏchchi kŏchchi battidoḍam̐ gŏluvulu sese nīgu
ichchagamulāḍĕm̐ jĕli iṁdām̐kānu
machchigadom̐ gŏppu duvvi manasĕllām̐ garam̐giṁchĕ
mĕchchavayyā im̐kanainā melĕrim̐gi nīvu

(||nĕra||)
payyĕda sĕram̐gu jāra palumāru bādālŏttĕ
nĕyyamule pasariṁchĕ ninnaḍanuṁḍi
vŏyyane gaṁdamuvūsi vusida mĕllā nĕrabĕ
yiyyavayyā vuḍugara lidavĕrim̐gi nīvu

(||nĕra||)
vīḍĕmichchi movidenĕ viṁduvĕṭṭi lālanado
veḍugale pasariṁchĕ vegi naṁtānu
yīḍane śhrīveṁkaḍeśha yelidivi nannu nīgĕm̐
gūḍavayyā pŏṁdula gurudĕrim̐gi nīvu