Nerajaana vannidaanu neeve nannu mannimchevu

నెరజాణ వన్నిటాను నీవే నన్ను మన్నించేవు
Language

(॥పల్లవి॥)
నెరజాణ వన్నిటాను నీవే నన్ను మన్నించేవు
వెరవెరిఁగి మా(మొ?)క్కేను వేగిరించ నేఁటికి

(॥నెర॥)
కలికితనాల నిన్ను గరఁగించవసమా
బలిమితో నీ చిత్తము పట్టవసమా
వలపించి నిన్ను నిట్టే వంచుకొనవసమా
చెలఁగి నీకుఁ బ్రియము చెప్పఁగలఁగాక

(॥నెర॥)
మాటలాడి నిన్నుఁ గడు మరిగించవసమా
యీటు వెట్టుకొని యెలయించవసమా
మేటిరతులను నిన్ను మెప్పించవసమా
సూటితో నా వినయమే చూపఁగలఁగాక

(॥నెర॥)
బెరసి నీతో సిరిఁ బెనఁగఁగ వసమా
తిరమే(మై?) నేర్పున సాదించవసమా
గరిమ శ్రీవేంకటేశ కాఁగిట నన్నేలితివి
వొరయ వసమా కూడుండఁగలఁగాక

(||pallavi||)
nĕrajāṇa vanniḍānu nīve nannu manniṁchevu
vĕravĕrim̐gi mā(mŏ?)kkenu vegiriṁcha nem̐ṭigi

(||nĕra||)
kaligidanāla ninnu garam̐giṁchavasamā
balimido nī sittamu paṭṭavasamā
valabiṁchi ninnu niṭṭe vaṁchugŏnavasamā
sĕlam̐gi nīgum̐ briyamu sĕppam̐galam̐gāga

(||nĕra||)
māḍalāḍi ninnum̐ gaḍu marigiṁchavasamā
yīḍu vĕṭṭugŏni yĕlayiṁchavasamā
meḍiradulanu ninnu mĕppiṁchavasamā
sūḍido nā vinayame sūbam̐galam̐gāga

(||nĕra||)
bĕrasi nīdo sirim̐ bĕnam̐gam̐ga vasamā
tirame(mai?) nerbuna sādiṁchavasamā
garima śhrīveṁkaḍeśha kām̐giḍa nannelidivi
vŏraya vasamā kūḍuṁḍam̐galam̐gāga