నేను తనకు నెదురా నేరుపరి కడుఁ దాను
(॥పల్లవి॥)
నేను తనకు నెదురా నేరుపరి కడుఁ దాను
రానంటా నన్నేల దూరీ రతివిరహమున
(॥నేను॥)
పంతములాడేటివాఁడు బలిమి చూపుమనవే
మంతనాన విరులేసే మరునితోను
రంతులు నాతోనేల రవ్వగా వాదించుఁగాక
చింతలురేఁచేయట్టిచిలుకతోను
(॥నేను॥)
మేరతోనేల సాదించీ మించి కోపించుమనవే
సారె వెన్నెలల వేఁచే చందురుపైని
గోరడి నన్నేల కొని గుంపించి పైకొనుఁగాక
సారెకును విసరేటి చలిగాలిపైని
(॥నేను॥)
పెనఁగి కూడేటివాఁడు బీరము చూపుమనవే
కినిసి తొడరేవసంతునియెదుటా
యెనసి శ్రీవేంకటేశుఁ డెమ్మెలు మెరయుఁగాక
వెనకముందరితనవెలఁదులయెదుటా
(||pallavi||)
nenu tanagu nĕdurā nerubari kaḍum̐ dānu
rānaṁṭā nannela dūrī radivirahamuna
(||nenu||)
paṁtamulāḍeḍivām̐ḍu balimi sūbumanave
maṁtanāna virulese marunidonu
raṁtulu nādonela ravvagā vādiṁchum̐gāga
siṁtalurem̐seyaṭṭisilugadonu
(||nenu||)
meradonela sādiṁchī miṁchi kobiṁchumanave
sārĕ vĕnnĕlala vem̐se saṁdurubaini
goraḍi nannela kŏni guṁpiṁchi paigŏnum̐gāga
sārĕgunu visareḍi saligālibaini
(||nenu||)
pĕnam̐gi kūḍeḍivām̐ḍu bīramu sūbumanave
kinisi tŏḍarevasaṁtuniyĕduḍā
yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍĕmmĕlu mĕrayum̐gāga
vĕnagamuṁdaridanavĕlam̐dulayĕduḍā