పల్లవి:
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ
చరణం 1:
అగ్నినేత్ర ఉగ్ర జ్వాళ దాచినా ఓ రుదృడా
అగ్ని శిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశమా
హింసనణచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా
మన్యం వీరుడు రామరాజు ధనుష్టం కారాసివా
భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా
చరణం 2:
అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
చమురు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా
pallavi:
nenu saidaṁ prabaṁchāgnigi samidhanŏkkaḍi āhudichchānu
nenu saidaṁ viśhva vṛṣhṭigi aśhruvŏkkaḍi dhāravosānu
nenu saidaṁ bhuvana ghoṣhagu vĕrri gŏṁtuga vichchi mŏsānū
saraṇaṁ 1:
agninetra ugra jvāḽa dāsinā o rudṛḍā
agni śhikhalanu guṁḍĕlonā aṇasinā o sūryuḍā
paraśhvadhamunu sedabūnina paraśhurāmuni aṁśhamā
hiṁsanaṇasaga dhvaṁsa rasanalu sesina āsāryuḍā
manyaṁ vīruḍu rāmarāju dhanuṣhṭaṁ kārāsivā
bhagat siṁk kaḍasāri paligina iṁkvilāp śhabdānivā
saraṇaṁ 2:
akramālanu kālarāsina ukku pādaṁ nīdirā
laṁchagŏṁḍula guṁḍĕlo niduriṁchu siṁhaṁ nīvurā
dharmadevada nīḍalo payaniṁchu yātre nīdirā
samuru kappina nyāyadevada kaṁṭi sūbaināvurā
satyameva jagadigi niluvĕttu sākṣhyaṁ nīvurā
lakṣhalādi prajala āśhā jyodivai nilisāvurā