Nenu puttaanu logam mechchimdi

నేను పుట్టాను లోకం మెచ్చింది
Work
Year
Language

పల్లవి:

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది..
డోంట్ కేర్.. !!నేను!!

చరణం 1:

నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి
నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి

నేను ఆడితే అందరి కాళ్లు నాతో కలిశాయి ||2||
తెల్లవారితే వెనకచేరి నవ్వుకుంటాయి..
హ హ హ హ హ... డోంట్ కేర్... ||నేను||

చరణం 2:

మనసులు దాచేటందుకు పైపై నవ్వులు ఉన్నాయి
మనిషికి లేని అందం కోసం రంగులు ఉన్నాయి
ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి ||2||
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి..
డోంట్ కేర్.... ||నేను||

చరణం 3:

మనిషిని మనిషిని కలిపేటందుకే పెదవులు ఉన్నాయి
పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి
బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్ ||2||
అగ్గిపుల్ల గీసేసెయ్ నీలో సైతాన్ తరిమేసేయ్..
డ్రైవ్ ది డెవిల్ అవుట్..హ హ హ హ హ హ... ||నేను||

pallavi:

nenu puṭṭānu logaṁ mĕchchiṁdi
nenu eḍchānu logaṁ navviṁdi
nenu navvānu ī logaṁ eḍchiṁdi
nāgiṁkā logaṁto pani emuṁdi..
ḍoṁṭ ker.. !!nenu!!

saraṇaṁ 1:

nenu tāgide kŏṁdari kaḽlu giragira tirigāyi
nenu pāḍide aṁdari noḽlu vaṁtalu pāḍāyi
nenu tāgide kŏṁdari kaḽlu giragira tirigāyi
nenu pāḍide aṁdari noḽlu vaṁtalu pāḍāyi

nenu āḍide aṁdari kāḽlu nādo kaliśhāyi ||2||
tĕllavāride vĕnagaseri navvuguṁṭāyi..
ha ha ha ha ha... ḍoṁṭ ker... ||nenu||

saraṇaṁ 2:

manasulu dāseḍaṁdugu paibai navvulu unnāyi
maniṣhigi leni aṁdaṁ kosaṁ raṁgulu unnāyi
ĕragaga namminavāḽla nĕttigi sedulu vastāyi ||2||
ĕduḍi maniṣhigi sĕppeḍaṁduge nīdulu unnāyi..
ḍoṁṭ ker.... ||nenu||

saraṇaṁ 3:

maniṣhini maniṣhini kalibeḍaṁduge pĕdavulu unnāyi
pĕdavulu madhuraṁ seseḍaṁduge madhuvulu unnāyi
bādhalanni bāḍillo neḍe diṁpesey ||2||
aggibulla gīsesĕy nīlo saidān darimesey..
ḍraiv di ḍĕvil avuṭ..ha ha ha ha ha ha... ||nenu||