నేను నీవంటిదాన నేరమెంచేనా
(॥పల్లవి॥)
నేను నీవంటిదాన నేరమెంచేనా
దానికేమి నీలోనే తలఁచుకో పనులు
(॥నేను॥)
మగఁడు వద్ద నుండగా మాట మాఁటలను నీతో
జగడములడచేనా సాదవు నీవు
నగవు నీవు నవ్వఁగా నాకేల కోపము వచ్చీ
తగవులు నీవే చెప్పి తలఁచుకో పనులు
(॥నేను॥)
ఆతనికి నీవిట్టె ఆకు మడిచియ్యఁగాను
చేత నిన్ను దొబ్బేనా సిగ్గుదానవు
నీతితో నడవఁగాను నిన్ను దూరేనా నేను
దైతతన మెవ్వరందో తలఁచుకోపనులు
(॥నేను॥)
అలమేల్మంగవు నీవు ఆతఁడు శ్రీ వేంకటేశు
డలిగేనా నే నీతో నంత దొరవు
మలసి విభునిచేత మన్నింపించితివి నేఁడు
తలఁపెల్లా నొక్కటాయ తలఁచుకో పనులు
(||pallavi||)
nenu nīvaṁṭidāna neramĕṁchenā
dānigemi nīlone talam̐sugo panulu
(||nenu||)
magam̐ḍu vadda nuṁḍagā māḍa mām̐ṭalanu nīdo
jagaḍamulaḍasenā sādavu nīvu
nagavu nīvu navvam̐gā nāgela kobamu vachchī
tagavulu nīve sĕppi talam̐sugo panulu
(||nenu||)
ādanigi nīviṭṭĕ āgu maḍisiyyam̐gānu
seda ninnu dŏbbenā siggudānavu
nīdido naḍavam̐gānu ninnu dūrenā nenu
daidadana mĕvvaraṁdo talam̐sugobanulu
(||nenu||)
alamelmaṁgavu nīvu ādam̐ḍu śhrī veṁkaḍeśhu
ḍaligenā ne nīdo naṁta dŏravu
malasi vibhuniseda manniṁpiṁchidivi nem̐ḍu
talam̐pĕllā nŏkkaḍāya talam̐sugo panulu