నేనూ సంతోసించుకొనే నీకుఁ దోడుగా నేఁడు
(॥పల్లవి॥)
నేనూ సంతోసించుకొనే నీకుఁ దోడుగా నేఁడు
ఆనుక నీదేవినైతి నానతీవయ్యా
(॥నేన॥)
కళలు నీమొగమునఁ గడు నిండెను
సెలవులఁ జిరునవ్వు చిమ్మిరేఁగీని
చెలపలచెమటలు చెక్కుల నవె
అలరిన నీ వేడుక లానతీవయ్యా
(॥నేన॥)
అరవిరిబాగులు నీయందుఁ జూపట్టె
శిరసులోపల వింతవిరు లున్నవి
గిరిగొన్న మోవిమీఁదఁ గెంపులు నవె
అరుదైననీవేడుక లానతీవస్సా
(॥నేన॥)
కనుఁగోనచూపులు కడుఁదేటాయ
నినుపులై వింతతావి నిండె నీమేన
యెనసి యలమేల్‌మంగనేలిన శ్రీవేంకటేశ
అనిశము నీవేడుక లానతియ్యవయ్యా
(||pallavi||)
nenū saṁtosiṁchugŏne nīgum̐ doḍugā nem̐ḍu
ānuga nīdevinaidi nānadīvayyā
(||nena||)
kaḽalu nīmŏgamunam̐ gaḍu niṁḍĕnu
sĕlavulam̐ jirunavvu simmirem̐gīni
sĕlabalasĕmaḍalu sĕkkula navĕ
alarina nī veḍuga lānadīvayyā
(||nena||)
araviribāgulu nīyaṁdum̐ jūbaṭṭĕ
śhirasulobala viṁtaviru lunnavi
girigŏnna movimīm̐dam̐ gĕṁpulu navĕ
arudainanīveḍuga lānadīvassā
(||nena||)
kanum̐gonasūbulu kaḍum̐deḍāya
ninubulai viṁtadāvi niṁḍĕ nīmena
yĕnasi yalamelmaṁganelina śhrīveṁkaḍeśha
aniśhamu nīveḍuga lānadiyyavayyā