Nenemi neṟamganu ninnegaani

నేనేమి నెఱఁగను నిన్నేకాని
Language

(॥పల్లవి॥)
నేనేమి నెఱఁగను నిన్నేకాని
మోనాన నాలోనున్న మోహమెల్ల నీది

(॥నేనే॥)
కన్నెదాననైననన్ను కలికిఁ జేసితివి
పిన్నచన్ను లింతేసిగాఁ బెంచితివి
తిన్ననినామోవినిండా తేనెలే వూరించితివి
పన్నిననాజవ్వనభారమెల్లా నీది

(॥నేనే॥)
కందువ నామోమున కళలెల్లా రేఁచితివి
పొందుగ చూపుల వాఁడి పుట్టించితివి
చిందేటిచెమటతోడ సిగ్గువడ నేరిపితివి
అందపునాసింగార మదియెల్లా నీది

(॥నేనే॥)
మలసి మాఁటలలోని మర్మముఁ దెలిపితివి
కలసి దేవులఁగాఁ గైగొంటివి
అలమేల్ మంగను నేను అన్నిటా శ్రీవేంకటేశ
తలఁచుకో నాచక్కఁదనమెల్లా నీది

(||pallavi||)
nenemi nĕṟam̐ganu ninnegāni
monāna nālonunna mohamĕlla nīdi

(||nene||)
kannĕdānanainanannu kaligim̐ jesidivi
pinnasannu liṁtesigām̐ bĕṁchidivi
tinnanināmoviniṁḍā tenĕle vūriṁchidivi
panninanājavvanabhāramĕllā nīdi

(||nene||)
kaṁduva nāmomuna kaḽalĕllā rem̐sidivi
pŏṁduga sūbula vām̐ḍi puṭṭiṁchidivi
siṁdeḍisĕmaḍadoḍa sigguvaḍa neribidivi
aṁdabunāsiṁgāra madiyĕllā nīdi

(||nene||)
malasi mām̐ṭalaloni marmamum̐ dĕlibidivi
kalasi devulam̐gām̐ gaigŏṁṭivi
alamel maṁganu nenu anniḍā śhrīveṁkaḍeśha
talam̐sugo nāsakkam̐danamĕllā nīdi