Nenaa vinnavimchidi nee sittamugolamdimka

నేనా విన్నవించితి నీ చిత్తముకొలఁదిఁక
Language

(॥పల్లవి॥)
నేనా విన్నవించితి నీ చిత్తముకొలఁదిఁక
పేనిపట్టి వానితోడఁ బెనఁగఁగఁగలవా

(॥నేనా॥)
కొప్పుదువ్వేనంటాను కొరి వేడుకపడేవు
ముప్పి మురునమ్ములమూఁక లున్నవి
నెప్పునఁ గస్తూరిబొట్టు నెన్నుదుట దిద్దేవు
కప్పి బొమ్మలవిండ్లు కాచుకున్నవి

(॥నేనా॥)
మోవితేనియలనుఁ గమ్ముకొని యాసగించేవు
భావజుని చిగురాకుఁబట్టె మున్నది
మోవరాని మొగపులమొలనూ ళ్లంటేవు
తావుకొని చక్రము లాదండనే వున్నది

(॥నేనా॥)
పంతముతో మూసినపయ్యద జారఁదీసేవు
వింతలె జక్కవ లవే వేగు లున్నవి
యింతలో శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
సంతోసాలు మనసులో చాలుకొన్నవి

(||pallavi||)
nenā vinnaviṁchidi nī sittamugŏlam̐dim̐ka
penibaṭṭi vānidoḍam̐ bĕnam̐gam̐gam̐galavā

(||nenā||)
kŏppuduvvenaṁṭānu kŏri veḍugabaḍevu
muppi murunammulamūm̐ka lunnavi
nĕppunam̐ gastūribŏṭṭu nĕnnuduḍa diddevu
kappi bŏmmalaviṁḍlu kāsugunnavi

(||nenā||)
movideniyalanum̐ gammugŏni yāsagiṁchevu
bhāvajuni sigurāgum̐baṭṭĕ munnadi
movarāni mŏgabulamŏlanū ḽlaṁṭevu
tāvugŏni sakramu lādaṁḍane vunnadi

(||nenā||)
paṁtamudo mūsinabayyada jāram̐dīsevu
viṁtalĕ jakkava lave vegu lunnavi
yiṁtalo śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
saṁtosālu manasulo sālugŏnnavi