నెమ్మది నుండవయ్య నీకు నంతా సంతోసమే
(॥పల్లవి॥)
నెమ్మది నుండవయ్య నీకు నంతా సంతోసమే
సమ్మతించకుండరాదు సవతుల కిఁకను
(॥నెమ్మ॥)
ముప్పిరిగొనంగ నీవు మోహించిన కామినులు
చప్పనిమాట లాడినా చవివుట్టును
యెప్పుడు నీకొలువున నెడయకుండేవారు
తప్పులెంచి కొసరినాఁదమి రేఁగును
(॥నెమ్మ॥)
కోరి వేఁడి నీవుదెచ్చుకొనినసతులు నిన్ను
చేరి యేసేఁత సేసినాఁ జిత్తమువచ్చు
మేర మీరి నీచనవు మెరసినయట్టివారు
బీరము లెంతచూపినాఁబ్రియములై తోఁచును
(॥నెమ్మ॥)
మంతనాన నీ వెప్పుడు మన్నించేకాంతలు
వంతా లెంతనెరపినా బాంతియై యుండు
ఇంతలోన శ్రీవేంకటేశ నన్ను నేలితివి
వింతవా రెట్టునవ్వినా వేడుక వొడమును
(||pallavi||)
nĕmmadi nuṁḍavayya nīgu naṁtā saṁtosame
sammadiṁchaguṁḍarādu savadula kim̐kanu
(||nĕmma||)
muppirigŏnaṁga nīvu mohiṁchina kāminulu
sappanimāḍa lāḍinā savivuṭṭunu
yĕppuḍu nīgŏluvuna nĕḍayaguṁḍevāru
tappulĕṁchi kŏsarinām̐dami rem̐gunu
(||nĕmma||)
kori vem̐ḍi nīvudĕchchugŏninasadulu ninnu
seri yesem̐ta sesinām̐ jittamuvachchu
mera mīri nīsanavu mĕrasinayaṭṭivāru
bīramu lĕṁtasūbinām̐briyamulai tom̐sunu
(||nĕmma||)
maṁtanāna nī vĕppuḍu manniṁchegāṁtalu
vaṁtā lĕṁtanĕrabinā bāṁtiyai yuṁḍu
iṁtalona śhrīveṁkaḍeśha nannu nelidivi
viṁtavā rĕṭṭunavvinā veḍuga vŏḍamunu